స్టార్ హీరో సినిమా అంటే టైటిల్ సాంగ్ కంపల్సరీగా పడాల్సిందే. అదే ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో అయితే.. టైటిల్ సాంగ్ లో రచ్చ రచ్చ చేసేస్తుంటాడు. కానీ జనతా గ్యారేజ్ కోసం రూట్ మార్చేశాడు దర్శకుడు కొరటాల శివ. సహజంగా సినిమా స్టోరీని కాన్సెప్ట్ ని రివీల్ చేసేవాటిని.. రిలీజ్ చేసేవరకూ దాచిపెట్టడం ఆనవాయితీ. కానీ పాటల విషయంలో మాత్రం ఇది చెల్లదు. ఇవాళ జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ సందర్భంగా.. ఆ వేడుకకు కాసింత ముందే నెట్ లో పాటలు పెట్టేసింది హక్కులు కొనుక్కున్న కంపెనీ.
'ఎవ్వరు ఎవ్వరు వీరెవరు.. ఎవరికి వరుసకు ఏమవరు.. అయినా అందరి బంధువులు.. జయహో జనతా!.. ఒక్కరు కాదు ఏడుగురు.. దేవుడు పంపిన సైనికులు.. సాయం చేసే సాయుధులు.. జయహో జనతా!'.. ఇదీ టైటిల్ సాంగ్ కి పల్లవి. జనతా గ్యారేజ్ లో రిపేర్లు చేయడమంటే.. పేదవాళ్లకు సాయం చేయడమే అనే విషయం ఇప్పటికే టీజర్ లో చెప్పేశారు. బలహీనుడు పక్కనుండే బలమే జనతా గ్యారేజ్ అనే సంగతి ముందే తెలిసిపోయింది. ఇప్పుడు ఏడుగురు కలిసి.. ఎదుటి వాళ్లకు సాయం చేయడం కోసం ఎంతకైనా తెగించడమే.. ఈ సినిమా అని అర్ధమైపోతోంది.
ఇదిలాఉంటే.. ఈ టైటిల్ సాంగ్ ను సుఖ్వీందర్ సింగ్-విజయ్ ప్రకాష్ లు పాడారు. అటు లిరిక్ కానీ.. ఇటు వాయిస్ కానీ.. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కానీ.. అన్నీ ఒళ్లు గగుర్పొడిపించేస్తున్నాయి. జనతా గ్యారేజ్ కి డీఎస్పీ ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడో చెప్పేందుకు ఈ ఒక్క సాంగ్ సరిపోతుంది.