రజినీకాంత్ ని వాడేస్తున్న ఎన్టీఆర్

Update: 2016-07-21 17:30 GMT
జూనియర్ ఎన్టీఆర్ అంటేనే టాలీవుడ్ లో సంచలనం. ఈ జనరేషన్ స్టార్స్ లో మొదటగా స్టార్ అనిపించుకున్న రేంజ్ యంగ్ టైగర్ ది. అలాంటి జూనియర్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఫేమ్ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. కానీ ఇది తెలుగు సినిమా వరకే పరిమితం.

జూనియర్ లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ ని మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అందుకే మోహన్ లాల్ తోపాటు మరికొందరు మలయాళీ యాక్టర్స్ ను తీసుకున్నారనేది తెలిసిన విషయమే. ఇప్పుడు సూపర్ స్టార్ విషయానికొస్తే.. జూలై 22న విడుదల కానున్న కబాలితో కలిపి.. జనతా గ్యారేజ్ టీజర్ ను కేరళ వ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. అలా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఇందుకు ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. రజినీ కబాలి మూవీ అటు తమిళ్.. ఇటు మలయాళ వెర్షన్లు కేరళలో విడుదలవుతున్నాయి.

కబాలి మలయాళీ వెర్షన్ రైట్స్ ఎవరిదగ్గరున్నాయో  తెలుసా.. మోహన్ లాల్ దగ్గర. అలాగే జనతా గ్యారేజ్ రైట్స్ కూడా మోహన్ లాల్ దగ్గరే ఉన్న విషయం తెలిసిందే. అందుకే.. తను డబ్బులు పెట్టిన సినిమా ద్వారా.. తను నటించిన సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు ప్లాన్ చేశాడు మోహన్ లాల్. అలా రజినీకాంత్ కబాలి క్రేజ్ ని ఎన్టీఆర్ సినిమాకి ఉపయోగించాల్సి వచ్చిందన్న మాట.
Tags:    

Similar News