అమ్మ స్థాయిని నేనే కాదు ఎవరు అందుకోలేరు

Update: 2022-10-12 23:30 GMT
అతిలోక సుందరి శ్రీదేవి మృతి తర్వాత ఆమె వారసత్వంను ఆమె కూతురు జాన్వీ కపూర్‌ కొనసాగిస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి బతికి ఉన్న సమయంలోనే జాన్వీ కపూర్ మొదటి సినిమా ప్రారంభం అయ్యింది. దురదృష్టవశాత్తు శ్రీదేవి తన కూతురు మొదటి సినిమా ను వెండి తెరపై చూడలేక పోయింది.

జాన్వీ కపూర్‌ మొదటి సినిమా తో నిరాశ పర్చినా కూడా వరుసగా సినిమాలు చేస్తూ తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేసే ఫోటోలు మరియు అవార్డు వేడుకలకు ఈమె హాజరు అవుతున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. స్కిన్‌ షో విషయంలో ఈమె హాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్‌ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా జాన్వీ కపూర్ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. అమ్మ స్టార్‌ డమ్‌ ని ఎవరు టచ్‌ చేయలేరు. ఆమె స్టార్‌ డమ్‌ దగ్గరకి నేను మాత్రమే కాదు ఎవరు కూడా వెళ్లలేరు అంటూ జాన్వీ కపూర్‌ తన తల్లి గొప్పతనంను చెప్పుకొచ్చింది. ఆమె హీరోయిన్‌ గా ఇండియాస్‌ టాప్‌ స్టార్ గా నిలిచినందుకు గర్వంగా ఉంది.

అమ్మ యాక్టింగ్‌ చేస్తున్న సమయంలో నేను లేను. ఆమె స్టార్‌ గా ఉన్న సమయంలో మేము పుట్టలేదు. ఆమె సినిమా కెరీర్‌ కు గుడ్‌ బై చెప్పిన తర్వాత మేము పుట్టాము. మేము పుట్టిన తర్వాత సినిమాలకు అమ్మ దూరం అయ్యారు. ఆమె స్టార్‌ డమ్‌ కి తల్లి అయిన తర్వాత కూడా సినిమాలకు కంటిన్యూ అవ్వవచ్చు.

కానీ పూర్తిగా ఫ్యామిలీ పై దృష్టి పెట్టి శ్రీదేవి సినిమాలకు దూరం అయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాను చేసింది. ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.

ఆ సినిమా తర్వాత మళ్లీ బిజీ బిజీగా శ్రీదేవి సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె అంతలోనే మృతి చెంది అందరిలో శోఖం ను మిగిల్చి వెళ్లి పోయింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News