పుట్టిన రోజు పండగంటే అందరికీ ఆనందమే. హ్యాపీగా జరుపుకోవాల్సిన బర్త్ డే సెల్రబేషన్స్ ను బాధ నిండిన హృదయంతో జరుపుకోవాల్సి రావడం ఎంతో ఆవేదనకు గురిచేసే అంశమే. 20 పుట్టిన రోజులు అమ్మ పక్కన నుంచి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్న శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ఈ ఏడాది పుట్టిన రోజును తల్లి తోడు లేకుండా చేసుకోవాల్సి వచ్చింది.
శ్రీదేవి హఠాత్తుగా ఈ లోకానికి దూరమైపోయిన కొద్ది రోజుల్లోనే జాన్వి పుట్టినరోజు వచ్చింది. మామూలుగా అయితే అదిరిపోయే పార్టీతో ఈ రోజును ఎంజాయ్ చేసేదేమో. కానీ ఈసారి తల్లి లేని బాధ నుంచి ఇంకా తేరుకోలేదు. అందుకే పుట్టిన రోజును ముంబయిలోని ఓ వృద్ధాశ్రమంలో సింపుల్ గా చేసుకుంది. ఆశ్రమంలోని వృద్ధులందరి మధ్య కేక్ కట్ చేసి వారితోనే గడిపింది. 21 సంవత్సరంలో అడుగుపెట్టడంతో జాన్వి పెద్దది అవడమే కాదు.. కాదు ఇప్పుడు కుటుంబంలో పెద్ద కూతురిగా బాధ్యత భుజాన వేసుకుంది. ఆ మెచ్యూరిటీ.. స్ట్రాంగ్ నెస్ ఆమెలో ఇప్పుడే కనిపిస్తున్నాయి.
‘‘నా పుట్టిన రోజున మీ అందరిని అడిగేదొకటే. మీ కన్నవారిని ప్రేమించండి. వారితో ఆనందంగా గడపండి. మీ ప్రేమ వారికి పంచండి. మీ జన్మకు కారకులు వారు’’ అంటూ తన బర్త్ డే సందర్భంగా రాసిన లెటర్ లో అందరినీ కోరింది. కళ్ల నిండా నీళ్లున్నా వాటిని ఆశ్రమంలో అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ గడిపిన జాన్వి కచ్చితంగా అందరి హృదయాలను గెలుచుకుందనే చెప్పాలి.