బొద్దింకలతో నిండిన గదిలో జాన్వీ బంధిఖానా

Update: 2022-11-17 00:30 GMT
బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉంది జాన్వీ కపూర్. ఈ యంగ్ బ్య‌టీ న‌టించిన `మిలీ` ఎట్టకేలకు నవంబర్ 4న పెద్ద తెరపైకి వచ్చింది. పాజిటివ్ సమీక్షలతో మిలీ బాక్సాఫీస్ వ‌ద్ద బాగానే రాణించింద‌ని ట్రేడ్ వెల్ల‌డించింది.  మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించిన ఈ సర్వైవల్-థ్రిల్లర్ లో సన్నీ కౌశల్ - మనోజ్ పహ్వా కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఇది మలయాళ భాషా చిత్రం హెలెన్ కి రీమేక్.

ఈ సినిమాని జాన్వీ తండ్రి బోనీక‌పూర్ స్వ‌యంగా నిర్మించ‌డం ఆస‌క్తిక‌రం. పాపా బోనీ నిర్మాత‌గా మొదటి సహకారం జాన్వీకి చాలా ప్రత్యేకమైనది. తన స్పెషల్ సర్వైవల్ డ్రామాను ప్రచారం చేస్తూ తాజాగా జాన్వీ చెప్పిన ఓ సంగ‌తి యువ‌త‌రంలో హాట్ టాపిగ్గా మారింది. తాను బొద్దింకలతో నిండిన గదిలో ఎందుకు బంధించబడాలనుకుంటోందో జాన్వీ ఈ ఇంట‌ర్వ్యూలో వివరించింది.

ఒక‌వేళ బొద్దింకలతో నిండిన గదిలో బంధించబ‌డితే లేదా మిలీ సినిమాలో లాగా ఫ్రీజర్ లో బంధించబ‌డితే..? ఈ రెండిటిలో ఏది బెస్ట్.. మీరైతే ఏం చేస్తారు?  మీ ఫీలింగ్ ఏంటీ? అంటూ హోస్ట్ జాన్వీ క‌పూర్ ని స‌ర‌దాగా ప్ర‌శ్నించారు. దానికి జాన్వీ ఆస‌క్తిక‌ర సమాధానం ఇచ్చింది. ``నేను ఫ్రీజర్ లోకి తిరిగి వెళ్లలేను. నేను బొద్దింకలతో నిండిన గదిలో బంధించబడితేనే బెట‌ర్‌`` అని చెప్పింది. ఫ్రీజర్‌లో ఉండటం చాలా కష్టంగా ఉందని కూడా జాన్వీ తెలిపింది.

జాన్వీ కపూర్ `మిలీ` క‌థాంశం ఆస‌క్తిక‌రం. ఒక ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీలో వెయిటర్ గా పనిచేసి 48 గంటలకు పైగా ఫ్రీజర్ లో బంధించబడిన ఒక అమ్మాయి క‌థేమిట‌న్న‌ది తెర‌పై చూపించారు. ఈ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ లో జాన్వీ ఎమోష‌న‌ల్ పెర్ఫామెన్స్ తో క‌ట్టి ప‌డేసింద‌ని క్రిటిక్స్ ప్ర‌శంసించారు. ప్రస్తుతం మిలీ థియేటర్లలో విజ‌య‌వంతంగా ఆడుతోంది.

జాన్వీ కపూర్ త‌దుపరి వ‌రుస‌ ప్రాజెక్ట్ లతో అద్భుతమైన లైనప్ ను కలిగి ఉంది. త‌దుప‌రి స్పోర్ట్స్ కామెడీ మిస్టర్ అండ్ మిసెస్ మహి కోసం .. రూహీ సహనటుడు రాజ్ కుమార్ రావ్ తో మళ్లీ కలిసి ప‌ని చేయ‌నుంది. అలాగే రొమాంటిక్ కామెడీ `బవాల్‌`లో న‌టించ‌నుంది. ఈ మూవీతో  మొదటిసారి వరుణ్ ధావన్ తో స్క్రీన్ ను పంచుకోనుంది. త్వ‌ర‌లో టాలీవుడ్ లోను ఆరంగేట్రం చేయ‌నుంది.  జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ క‌థానాయిక‌గా న‌టించే ఛాన్సుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News