రక్షణశాఖ అనుమతి కోసం జాన్వీ ఎదురుచూపులు

Update: 2019-04-26 09:38 GMT
రీదేవి కూతురుగా బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌ మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు అయితే దక్కించుకుంది. కాని కమర్షియల్‌ గా మాత్రం జాన్వీకి మంచి బ్రేక్‌ రాలేదు. మొదటి సినిమా నిరాశ పర్చినా కూడా జాన్వీ ఎమాత్రం నిరుత్సాహ పడకుండా వరుసగా చిత్రాలు చేస్తూనే ఉంది. కరణ్‌ జోహార్‌ దర్మ ప్రొడక్షన్స్‌ లో జాన్వీ కపూర్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'కార్గిల్‌ గర్ల్‌'. ఈ చిత్రం ఇండియన్‌ తొలి ఎయిర్‌ ఫోర్స్‌ ఉమెన్‌ ఫైలట్‌ గుంజన్‌ సక్సేనా రియల్‌ స్టోరీ ఆధారంగా తెరకెక్కించడం జరుగుతుంది. గుంజన్‌ సక్సేనా పాత్రలో జాన్వీ కపూర్‌ నటిస్తోంది.

ఈ చిత్రం ఎయిర్‌ ఫోర్స్‌ కు సంబంధించిన గుంజన్‌ సక్సేనా బయోపిక్‌ అవ్వడం వల్ల ఈ చిత్రానికి దేశ రక్షణ శాఖ నుండి అనుమతి రావాల్సి ఉంది. స్క్రిప్ట్‌ కు రక్షణ శాఖ అనుమతించిన తర్వాతే షూటింగ్‌ మొదలు పెట్టాల్సి ఉంటుంది. కాని అనుమతులు ఇంకా రాకుండానే షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి నుండే షూటింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం అనుమతుల విషయంలో రక్షణ శాఖతో చిత్ర యూనిట్‌ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం తప్పకుండా ఈ చిత్రంకు రక్షణ శాఖ నుండి అనుమతులు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.

కార్గిల్‌ యుద్దంలో క్రియాశీలక పాత్ర పోషించిన గుంజన్‌ సక్సేనా అప్పట్లో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. శరణ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ తండ్రి పాత్రలో పంకజ్‌ త్రిపాఠి నటిస్తున్నారు. ఈ చిత్రంతో మరోసారి జాన్వీ కపూర్‌ నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు, కమర్షియల్‌ సక్సెస్‌ ను కూడా దక్కించుకుని స్టార్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుంటుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News