మిల మిల మెరుపుల జూ.అతిలోక సుంద‌రి

Update: 2021-10-29 14:30 GMT
అతిలోక సుంద‌రి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ స్పీడ్ కి అడ్డూ ఆపూ లేదు. సోష‌ల్ మీడియాల్లో అన్ స్టాప‌బుల్ గా చెల‌రేగిపోతూ హాటెస్ట్ ఫోటోల‌ను షేర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జాన్వీ చాలా రేర్ గానే ట్రెడీష‌న‌ల్ లుక్స్ లో క‌నిపిస్తోంది. ఇన్ స్టా వేదిక‌గా జాన్వీ కాక‌లు పుట్టిస్తోంది. తాజాగా జాన్వీ డిజైన‌ర్ లుక్ లో మిల మిలా మెరిసిపోతున్న ఫోటోలు వైర‌ల్ గా మారాయి. సిల్వ‌ర్ లైనింగ్ డిజైన‌ర్ దుస్తుల్లో జాన్వీ అంద‌చందాలు ప్ర‌త్యేక శోభ‌ను సంత‌రించుకున్నాయి. క్రీగంటి చూపుల‌తో కుర్ర‌ హృద‌యాల్ని కొల్ల‌గొట్ట‌డంలోనూ జాన్వీ త‌ర్వాతే అని నిరూపిస్తోంది.

తాజా ఫోటోషూట్ ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. జాన్వీ ఫాలోవ‌ర్స్ ఈ ఫోటోషూట్ పై హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇక జాన్వీ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుత క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్లో `దోస్తానా-2` లో న‌టిస్తోంది. అదే బ్యాన‌ర్ లో మ‌రో రెండు చిత్రాలు క‌మిట్ అయింది. అలాగే అమ్మ‌డు న‌టించిన `గుడ్ ల‌క్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది.

`మిలీ` అనే మ‌రో చిత్రంలో కూడా న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక ద‌క్షిణాదిన ఎంట్రీ ఇవ్వ‌డానికి జాన్వీ ఆస‌క్తిగానే ఉంది. కానీ స‌రైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వ‌స్తే వ‌దులుకోవ‌డానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. త‌ల్లి త‌ర‌హాలోనే అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేయాల‌ని ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది. ఇక ఇటీవ‌ల తెలుగు సినిమాల కంటే మ‌ల‌యాళ చిత్రాల‌ను చూస్తూ గ‌డిపేస్తున్నాన‌ని జాన్వీ తెలిపింది. వీలుంటే మ‌ల‌యాళంలో న‌టిస్తాన‌ని కూడా ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News