జాన్వి బాయ్ ఫ్రెండ్ కు భయమట!

Update: 2019-01-07 10:56 GMT
చాలామంది సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ తో జనాలకు ఏం పని అని.... తమకు పర్సనల్ స్పేస్ ఉండాలని అనుకుంటారు గానీ అది ప్రాక్టికల్ గా వీలుపడదు.  జనాలకేమో సెలబ్రిటీల పట్ల మహా కుతూహలం ఉంటుంది. దీంతో మీడియావారు కూడా ఈ సెలబ్రిటీల పై ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వార్తలు కవర్ చేస్తుంటారు.  కొంతమంది జనాలు ఇలా సెలెబ్రిటీల న్యూస్ కవర్ చేస్తున్నందుకు మీడియా ను తిడతారు గానీ.. నిజానికి సెలబ్రిటీల వార్తలు బదులు మన ఇంటి పక్కనుండే ఎల్లమ్మ.. పుల్లమ్మల కథలు రాస్తే చదివేదేవరు?  అవి రాసినోడే చదువుకోవాలి!

ఇవన్నీ వినడానికి వింతగా ఉంటాయిగానీ నిజాలు మాత్రం అవే. అందుకే మనం ఎల్లమ్మ పుల్లమ్మల గురించి కాకుండా అతిలోక సుందరి  శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి గురించి మాట్లాడుకుందాం.  జాన్వి కి అక్షత్ రాజన్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. అతనితో డేటింగ్ చేస్తోందని చాలా రోజుల నుండి బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 'ధడక్' విజయం సాధించిన సమయంలో అక్షత్ తనకు D షేప్ లో ఉండే ఒక ఫ్లవర్ బొకే ఇస్తున్న ఫోటో ను తన సోషల్ మీడియా ఖాతాద్వారా పోస్ట్ చేసింది.  జాన్వి పుట్టిన రోజునాడు ILY అని కూడా పోస్ట్ చేసింది. దీంతో బాలీవుడ్ మీడియాలో హంగామా మొదలైంది.  ఎప్పుడెప్పుడు ఇద్దరూ కలిసి దొరుకుతారా.. క్లిక్ మనిపిద్దామా అంటూ ఎదురు చూస్తున్నారు.

దీంతో చిరాకు పడిన శ్రీదేవి కూతురు "నేను నా చిన్ననాటి స్నేహితుడు అక్షత్ తో డేటింగ్ చేస్తున్నాని రూమర్లు పుట్టించారు... ఈ రూమర్ల దెబ్బకు అతనేమో నాతో బయట కనిపించడానికే భయపడుతున్నాడు" అంటూ కామెంట్ చేసింది.  నిప్పు లేకుండా పొగ రాదుగా.. ముంబై లో సవాలక్ష మంది ఎలిజిబుల్ బ్యాచిలర్లు ఉంటే అక్షత్ తోనే జాన్వి డేటింగ్ చేస్తోందని ఎందుకు అంటారు? ఇదంతా సరే గానీ అక్షత్ ఎవరని మీకు అనుకనం వచ్చిందా? ఎవరంటే.. గ్యామన్ ఇండియా కంపెనీ చైర్మన్ అభిజిత్ రాజన్ తనయుడు. పెద్ద బిజినెస్ ఫ్యామిలీ కి వారసుడు. అది సంగతి. 




Full View
Tags:    

Similar News