అందాల ఆరబోతలో పీ.హెచ్.డి చదివేసింది జాన్వీ కపూర్. కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతూ లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించింది. కేవలం ఇన్ స్టాలో దాదాపు 2.3 కోట్ల (20.3 మిలియన్లు) ఫాలోవర్లతో దుమ్ము రేపుతోంది.
సోషల్ మీడియాలో తన గ్లామ్ ఇమేజ్ గురించి రకరకాలుగా చర్చ సాగుతోంది. ఇటీవలి కాలంలో వరుస ఫోటోషూట్లతో జాన్వీ టూమచ్ గా విరుచుకుపడుతోందని.. మరో జూనియర్ ఉర్ఫీ జావెద్ లా మారిందని విమర్శించిన వారు ఉన్నారు. అయితే జాన్వీ కపూర్ అందాల ఆరబోత వెనక టాప్ సీక్రెట్ ని ఇప్పుడు బాహాటంగా వెల్లడించి తనపై వస్తున్న కామెంట్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
అసలు ఇంతగా ఆరబోయడం దేనికి? అని సూటిగా అడిగేస్తే అదంతా తన అనుచరులను పెంచుకునేందుకేనని తనకు లైక్ లు క్లిక్ లు రాకపోతే ఈఎంఐలు కట్టడం అంత తేలిక కాదని కూడా క్లియర్ కట్ గా చెప్పింది. ఇక సోషల్ మీడియాలు తనకు వినోదం కోసం ఉపయోగపడే అడ్డాలు అని కూడా చెప్పకనే చెప్పింది. వివరాల్లోకి వెళితే...
జాన్వీ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో తన గ్లామ్ ఇమేజ్ గురించి ఓపెనైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సోషల్ మీడియాతో సరదాగా గడపడం తనకు ఇష్టమని నటి పేర్కొంది. ఇటీవల విడుదలైన సర్వైవల్ డ్రామా మిలీలో జాన్వీ నటనకు గొప్ప ప్రశంసలు కురిసాయి. ఈ చిత్రం పాజిటివ్ సమీక్షలను అందుకుంది. ప్రశంసలు పొందిన మలయాళ చిత్రం హెలెన్ కి అధికారిక రీమేక్ ఇది. కష్టపడి పనిచేసే యువతి మిలీగా టైటిల్ పాత్రలో జాన్వీ నటించింది.
ప్రతిభావంతురాలైన జాన్వీ ఇప్పటికే కెరీర్ లో దూసుకుపోతోంది. కొన్ని అసాధారణమైన పాత్రల ఎంపికతో అద్భుత నట ప్రదర్శనలతో మనసులు దోచేసింది. ప్రత్యేకమైన ఎంపికలతో పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. జాన్వీ కపూర్ ఎప్పుడూ తన కంఫర్ట్ జోన్ కు దూరంగా ఉండే పాత్రలను ఎంపిక చేసుకోదు. సురక్షితంగా గేమ్ ని నడిపించేందుకు ప్రయత్నిస్తుంది. అందులోనే వైవిధ్యం కోసం తపిస్తుంది.
తాజా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో తన గ్లామ్ ఇమేజ్ గురించి ఓపెనైంది. నిజానికి నేను నా నిజ జీవితంలో అలా ఉండను. తెరపై ఉన్న ఇమేజ్ కి భిన్నంగా ఉంటాను.. అని జాన్వీ టాప్ సీక్రెట్ ని బయటపెట్టింది. తాను సోషల్ మీడియాతో సరదాగా గడపాలనుకుంటానని తెలిపింది. ఇలా చేస్తే తన EMIలను చెల్లించడంలో సహాయపడుతుందని అసలు రహస్యాన్ని బహిర్గతం చేసింది. ``నేను దీన్ని అంత సీరియస్ గా తీసుకోనక్కరలేదు. సోషల్ మీడియా నాకు సరదా.. నేను క్యూట్ గా కనిపిస్తే మరో ఐదుగురు వ్యక్తులు నా ఫోటోలను ఇష్టపడితే నేను అదనంగా మరొక బ్రాండ్ ను పొందుతాను. ప్రకటనల్లో నటించి నా ఈఎంఐలు చెల్లించగలనని ఆశిస్తున్నాను. ఇంతకుముందు కంటే చాలా సులభంగా EMIలు చెల్లిస్తున్నాను`` అని జాన్వీ కపూర్ టాప్ సీక్రెట్ ని ఓపెనైంది.
అలాగే సామాజిక మాధ్యమాల్లో తనకు కొన్ని సూచనలు కూడా అందుతాయని కానీ దానినుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తానని జాన్వీ చెప్పింది. నెటిజనుల అభిప్రాయం ప్రకారం.. ``మీరు చేస్తున్న సినిమాలు నిర్దిష్ట బీట్‌లో ఉంటాయి. మీ సోషల్ మీడియా ఉనికి చాలా వైరుధ్యంగా ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని ఇందులో చూస్తూ ఉంటే ఆ పాత్రలకు సింక్ కాలేరు! త్వరగా మారండి`` అని కూడా సలహాలిస్తారట. అయితే నేను అలాంటి గణాంకాల నుండి నన్ను నేను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను! అని జాన్వీ కపూర్ ఇంటర్వ్యూలో తెలిపారు.
జాన్వీ కపూర్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. వరుస ప్రాజెక్ట్ లతో అద్భుతమైన లైనప్ ను కలిగి ఉంది. తదుపరి స్పోర్ట్స్ కామెడీ మిస్టర్ అండ్ మిసెస్ మహి కోసం .. రూహీ సహనటుడు రాజ్ కుమార్ రావ్ తో మళ్లీ కలిసి పని చేయనుంది. అలాగే రొమాంటిక్ కామెడీ `బవాల్`లో నటించనుంది. ఈ మూవీతో తన కెరీర్ లో మొదటిసారి వరుణ్ ధావన్ తో స్క్రీన్ ను పంచుకోనుంది. త్వరలో టాలీవుడ్ లోను ఆరంగేట్రం చేయనుంది. జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ కథానాయికగా నటించే ఛాన్సుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.