ఫోటో స్టోరీ : క్యాజువల్ లుక్ తో కవ్విస్తున్న చిన్నది..!

Update: 2022-11-09 15:30 GMT
ఒక క్రేజ్ వచ్చాక సెలబ్రిటీస్ ఏం చేసినా అదో పెద్ద సెన్సేషన్ అవుతుంది. ముఖ్యంగా కథానాయికల విషయంలో అది మరింత ఇంప్యాక్ట్ చూపిస్తుంది. గ్లామర్ షోలో ఎవరి లిమిట్స్ వారికి ఉన్నా కొన్నిసార్లు వాటిని దాటేసి కూడా రచ్చ చేస్తుంటారు.

ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ జాన్వి కపూర్ తన అందాలతో ప్రేక్షకులను బంతాటాడేస్తుంది. స్టార్ తనయురాలైన అమ్మడు సినిమాలతో సంబంధం లేకుండా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఆడియన్స్ ని బుట్టలో వేసుకునేందుకు ఓ రేంజ్ లో రెడీ అవకుండానే క్యాజువల్ లుక్స్ తో కూడా ఎట్రాక్ట్ చేస్తుంది.       

లేటెస్ట్ గా జాన్వి కపూర్ క్యాజువల్ లుక్స్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముంబై వీధుల్లో చెక్కర్లు కొడుతున్న జాన్వి పై కెమెరా క్లిక్ అనిపించారు. వైట్ టీ షర్ట్.. మల్టీ కలర్ షార్ట్ తో రెగ్యులర్ వేర్ తో కనిపించింది జాన్వి.

బాలీవుడ్ హీరోయిన్స్ లో లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతూ ఫ్యాషన్ గా ఉండే వారిలో జాన్వి ఒకరు. అందుకే బయటకు వచ్చేప్పుడు హంగు ఆర్భాటాలతో కాకుండా జస్ట్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఇక అమ్మడి ఫిట్ నెస్ గురించి కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. తన పర్ఫెక్ట్ బాడీ షేప్ తో కుర్రాళ్లని చూపు తిప్పుకోకుండా చేస్తున్న జాన్వి తగినంత జిమ్ చేస్తూ బాడీ ఫిట్ గా ఉండేలా జాగ్రత్త వహిస్తుంది.        

రీసెంట్ గా మిలి సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వి ఆ సినిమాతో బీ టౌన్ ఆడియన్స్ ని అలరించింది. సినిమాలో తన పాత్ర కోసం బాగానే కష్టపడ్డది జాన్వి. అందుకే తన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా జాన్వి మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవలేదు. బాలీవుడ్ లో ఇంకా మరెన్నో ప్రయోగాలు చేస్తానని అంటున్న జాన్వి ఇండియన్ సినిమాల్లో తన మార్క్ చూపించాలని తెగ ఆరాటపడుతుంది.     

సౌత్ సినిమాలపై కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న అమ్మడు ఇక్కడ కూడా రాణించాలని ఫిక్స్ అయ్యింది. తెలుగు తమిళ భాషల్లో అమ్మ శ్రీదేవి లానే జాన్వి కూడా ఇక్కడ సినిమాలు చేయాలని చూస్తుంది. ఇక్కడ సరైన ఛాన్స్ కోసం చూస్తున్న జాన్వి సాధ్యమైనంతవరకు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకే ఓటు వేయాలని అనుకుంటుంది. కథ డిమాండ్ చేస్తే ఏ భాషలో అయినా నటించేందుకు సిద్ధమంటున్న జాన్విని ఎప్పుడెప్పుడు తెలుగు తెర మీద చూద్దామా అని ఆమె ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News