ఫోటో స్టొరీ: పింక్ బాంబింగ్.. స్టన్నింగ్

Update: 2019-06-20 05:50 GMT
బాలీవుడ్ లో ఒక్కో బ్యూటీకి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది.  దిశా పటాని ఇన్నర్ వేర్ల బ్యూటీ.  అదే జాన్వి కపూర్ ను తీసుకుంటే జిమ్ము డ్రెస్సుల పాప.  జిమ్ కు వెళ్ళే సమయంలో జాన్వి వేసే చిట్టిపొట్టి నిక్కర్లు చూస్తే ఎవరికైనా జివ్వని మనసు లాగుతుంది.  అలా అని ఈ బ్యూటీలు ఎప్పుడూ అదే రకమైన దుస్తులలో ఉండరు కదా?  రీసెంట్ గా జాన్వి గ్రేజియా మిలెనియల్ అవార్డ్స్ 2019 కార్యక్రమానికి హాజరయింది.

ఈ కార్యక్రమంలో జాన్వికి 'రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రదానం చేశారు.  ఈ ఈవెంట్ లో జాన్వి పింక్ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.  ఈ డ్రెస్ లో ప్రత్యేకంగా ఫోటో షూట్ చేసిన జాన్వి ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.  వీ నెక్ ఉండే పింక్ టాప్.. అదే కలర్ లో ఉన్న బెల్ బాటమ్ ప్యాంట్ ధరించి సూపర్ పోజులిచ్చింది. రెడ్ కలర్ లిప్ స్టిక్.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్ ధరించిన జాన్వి నిజంగానే ఈ జెనరేషన్ అతిలోక సుందరిలాగా కనిపించింది. అందాల ప్రదర్శనతో పాటుగా స్టైల్ ను.. గ్రేస్ ను రంగరించి పోజులివ్వడంతో నెటిజన్లు వెర్రెత్తిపోయారు.. పిచ్చపిచ్చగా లైకులు కొట్టారు.

'పింక్ డ్రెస్ మే మార్ డాలా మార్ డాలా".. "కిల్లర్ పోజ్ జాన్వి".. "పింక్ బాంబింగ్.. స్టన్నింగ్" అంటూ కామెంట్లు కూడా పెట్టారు.  జాన్వి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'కార్గిల్ గర్ల్' చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమాతో పాటు కరణ్ జోహార్ 'తఖ్త్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.  

 
Tags:    

Similar News