దేశవిదేశాల్లో ఫ్యాన్స్ ని సంపాదించడమంటే ఆషామాషీ కాదు. అలా లెక్కలు తీస్తే సౌత్ నుంచి రజనీకాంత్ పేరు మాత్రమే వినిపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకి అటు జపాన్ - మలేషియా - కొరియాలోనూ వీరాభిమానులున్నారు. అక్కడ అతడి స్టయిల్ ని ఇమ్మిటేట్ చేస్తూ బోలెడంత అభిమానం చూపిస్తుంటారు ఫ్యాన్స్. ఓ నటుడికి అలాంటి ఫ్యాన్ బేస్ దక్కడం అంటే ఆషామాషీ కాదు. అందుకే రజనీ యూనివర్శల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు అదే బాటలో విదేశాల్లోనూ ఫ్యాన్స్ ని సంపాదించుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీవోడికి జపాన్ లో వీరాభిమానులున్నారు అనడానికి ఈ ఉదాహరణ చాలు. ఓ జపనీ ఫ్యాన్ డ్యాన్సులు చేసిన తీరు చూస్తే మీరే ఆ సంగతిని ఒప్పుకుంటారు మరి.
ఓ వీరాభిమాని నాన్నకు ప్రేమతో సాంగ్స్ కి స్టెప్పులేస్తున్న తీరు ఇంటర్నెట్ లో హోరెత్తిపోతోంది. నాన్నకు ప్రేమతో మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ పెప్సీ సాంగ్స్ ని సమకూర్చాడు. ఈ బీట్స్ యూత్ ని ఊపేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పాడిన ఫాలో ఫాలో సాంగ్ కి అయితే ఇంటా బైటా ఓ రేంజులో ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ స్టెప్పులంటే పడిచచ్చే అభిమానులున్నారు. ఓ అభిమాని నాన్నకు ప్రేమతో పాటల్ని పెట్టుకుని ఇంట్లోనే స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్ లో పాపులర్ అయ్యింది. ఆ వీడియో మీరు కూడా చూడండి మరి. అచ్చం జపనీ ఎన్టీఆర్ లా ఉన్నాడని మీరే ఒప్పుకుంటారు మరి!