అతినమ్మకం అపజయమే నాయక!!

Update: 2017-09-08 17:30 GMT
ఏ నిర్మాత అయినా హీరో మార్కెట్ ను బట్టి సినిమాను నిర్మిస్తాడు. ఒక్కోసారి దర్శకుడు చెప్పిన కథను బట్టి అతని మీద నమ్మకంతో సినిమాను తెరకెక్కించడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా ఉర మాస్ దర్శకుడిగా పెరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను అతి నమ్మకంతో తీసిన "జయ జానకి నాయక" చివరికి డిజాస్టర్ గా నిలిచింది.

లై - నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో పోటీకి దిగిన జయ జానకి నాయక ఎట్టకేలకు కలెక్షన్స్ పరంగా అపజయాన్ని మూటగట్టుకుంది.  పోటీకి వచ్చిన ఇద్దరు హీరోల సినిమాలకన్న బెల్లంకొండ శ్రీనివాస్ సినిమానే అత్యధిక వసూళ్లు సాధించిందని గట్టిగానే ప్రచారం జరిగింది. కానీ సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే సినిమా ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది.

ప్రారంభంలో థియేట్రికల్ రైట్స్ 34 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాని తెలిసింది. కానీ ఆ తర్వాత పంపిణీదారులు నిర్మాతతో  కొంత ఘర్షణ కారణంగా చర్చలు జరిపి 31 కోట్ల రూపాయల ధరను తగ్గించారు. అయితే ఆ మొత్తం కూడా వచ్చిందనే దానిపై ఇంకా స్పష్టత లేద. దీంతో నిర్మాతకు నష్టాలనే మిగిల్చింది ఈ సినిమా. ఎందుకంటే సినిమ హీరో మార్కెట్ బట్టి నిర్మించకపోవడం కారణం అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక సినిమా కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే. 'జయ జనకి నాయక 'మొత్తం గ్రాస్ 36.25 కోట్లను రాబట్టగా.. 21.45 కోట్ల రూపాయల షేర్స్ ని అందుకుంది.

జయా జానకి నాయక మొత్తం కలెక్షన్స్ (షేర్):

నైజాం: రూ. 5.74 కోట్లు

సిడెడ్: రూ. 3.74 కోట్లు

ఉత్తర ఆంధ్ర: రూ. 2.80 కోట్లు

గుంటూరు: రూ. 1.89 కోట్లు

కృష్ణ: రూ. 1.35 కోట్లు

ఈస్ట్: రూ.1.58 కోట్లు

వెస్ట్:  రూ. 1.30 కోట్లు

నెల్లూరు: రూ. 1.04 కోట్లు

యు.ఎస్.ఎ: రూ. 0.24 కోట్లు,

కర్నాటక: రూ .1.20 కోట్లు,

ROI &  ROW: 0.56 కోట్లు

జయా జానకి నాయక ఏపీ & నైజాం మొత్తం కలెక్షన్స్: రూ. 19.45 కోట్లు

జయ జనకి నాయక ప్రపంచవ్యాప్త మొత్తం కలెక్షన్స్: రూ. 21.45 కోట్లు
Tags:    

Similar News