బాలయ్య హాస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్-2 దిగ్విజయంగా ముందుకు సాగిపోతున్న సంగతి తెలిసిందే. పనిచేసే కొద్దే ఊపొస్తుంది అన్నట్లు! బాలయ్య లో ఎపిసోడ్...ఎపిసోడ్ కి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. వచ్చిన అతిధులు నుంచి వీలైనంత విలువైన సమాచారం చాక చక్యంగా రాబడుతున్నారు. ఆ రకంగా బాలయ్య మరింత ఫేమస్ అవుతున్నారు.
తాజా ఎపిసోడ్ కి సీనియర్ నటులు జయప్రద..జయసుధ తో పాటు రాశీఖన్నా కూడా హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఇదే వేదకగా సీనియర్ స్టార్స్ ఇద్దరు పద్మ అవార్డులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. మీలాంటి సీనియర్లకు పద్మ అవార్డులు ఇవ్వకుండా కంగనలాంటి నటికి ఇవ్వడం సమంజసమేనా? అని బాలయ్య నోటి నుంచి రాగానే భగ్గుమన్నంత పనిచేసారు.
మీ కెరీర్ లోఎవరూ చేయనటి వంటి పాత్రలు చేసారు. అలాంటి ప్రయత్నాలు కూడా ఇంత వరకూ మరో నటి చేయలేదు. సినిమాల్లో పుట్టి పెరిగారు. సినిమాలు నిర్మించారు. ఇంత వరకూ ఒక ప్రభుత్వ అవార్డుకూడా రాలేదు. నిన్న మొన్న వచ్చిన కంగనకు పద్మ అవార్డు వచ్చింది? మీకు బాధగా లేదా? అని బాలయ్య సూటిగా ప్రశ్నించారు.
`నేను ..జయప్రద యంగ్ గా ఉన్నప్పుడు చాలా సినిమాలు చేసాం. భిన్నమైన పాత్రలు పోషించాం. కంగన విషయానికి వస్తే ఆమె అమెజింగ్ నటి. కానీ పది సినిమాలు చేసిన ఆమెకు పద్మ అవార్డు ఇచ్చి... మాకు ఇవ్వకపోడం బాధగానే ఉంద`న్నారు. అలాగే జయసుధ దక్షిణాది నటుల్ని కేంద్రప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు. `అలాగని నాకు పద్మ అవార్డు రాలేదని ఫిర్యాదు చేయడం లేదు. శారద..సావిత్రి..విజయ నిర్మల లాంటి ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు.
వాళ్లంతా ఎన్నో పాత్రల్లో మెప్పించారు. వాళ్లకి అవార్డులు రాలేదు. ఇది వివక్ష కాక మరేంటని? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయ నిర్మల నటిగా..దర్శకురాలిగా సేవలందించారు. గిన్సీస్ బుక్ ఆఫర్ రికార్డులోకి ఎక్కారు. అలాంటి నటిని కూడా గుర్తించకపోవడం దారుణమే అన్నారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కేంద్ర ప్రభుత్వం తెలుగు సహా దక్షిణాది సినిమాలపై వివక్ష చూపిస్తుందని చాలా కాలంగా విమర్శలొస్తున్నాయి. కానీ అవి అక్కడికే పరిమితం అవుతున్నాయి తప్ప! ఎలాంటి పురోగతి కనిపించలేదు.