జనతా థీమ్ సాంగ్ వెనుక ఏముందంటే..

Update: 2016-09-12 13:15 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ రెండో వీకెండ్ కూడా కంప్లీట్ చేసుకుంది. పది రోజుల్లోనే చాలానే రికార్డులు నమోదు చేసిన గ్యారేజ్ కి.. ఇంకా సరైన పోటీ ఇచ్చే సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. ఈ వీకెండ్ లో కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో.. మరో పది రోజులు కచ్చితంగా బాక్సాఫీస్ జనతా గ్యారేజ్ దే అని చెప్పేయచ్చు. అయితే.. వీక్ డేస్ లో కలెక్షన్స్ కొంచెం డల్ అయ్యాయనే కామెంట్స్ ఉన్నాయి.

ఈ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు ప్రమోషన్స్ పెంచేస్తోంది జనతా టీం. ఇప్పుడు సినిమాకి అత్యంత కీలకమైన జయహో జనతా థీమ్ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కేవలం మ్యూజిక్ డైరెక్టర్ కాదని... స్టోరీని.. సిట్యుయేషన్ ఫీల్ అయ్యి సంగీతం అందించే వ్యక్తి కావడంతోనే ఇంత గొప్పగా ఈ సాంగ్ హిట్ అయిందంటున్నాడు కొరటాల. లిరిక్ రైటర్ రామజోగయ్య అద్భుత సాహిత్యం.. పాటను అందించిన కాన్సెప్ట్ కారణంగానే అంత మంచి మ్యూజిక్ ఇవ్వగలిగానంటున్నాడు డీఎస్పీ.

పాట చిత్రీకరణ నుంచి మ్యూజిక్ వరకు అద్భుతంగా కుదరడంతోనే జయహో జనతాకు అంత బజ్ ఏర్పడించని చెప్పాడు రామజోగయ్య శాస్త్రి. ముగ్గురూ ఒకళ్లని ఒకళ్లు పొగుడుకుంటూ.. ఆ థీమ్ సాంగి మేకింగ్ కబుర్లను మొత్తం చెప్పేశారు.
Full View


Tags:    

Similar News