రాంగోపాల్ వర్మ గత నాలుగు రోజులుగా శ్రీదేవిని తప్ప మరింకేమీ పట్టించుకునే పరిస్థితిలో లేడు. కొన్ని రోజుల క్రితం వరకూ జీఎస్టీతో హంగామా చేసిన ఈ డైరెక్టర్.. ఆ తర్వాత నాగార్జునతో తీస్తున్న మూవీ గురించిన అప్ డేట్ ఇచ్చాడు. నెగిటివిటీ మధ్య కొంత పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తానంటూ.. నాగ్ సినిమా టైటిల్ ఆఫీసర్ అని.. మే నెల 25న విడుదల అవుతుందని చెప్పాడు. అయితే.. ఈ చిత్ర కథపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు వర్మ మాజీ అసిస్టెంట్.
జయకుమార్ అనే వ్యక్తి.. తన ఓ కథను వర్మ కాపీ కొట్టేసి.. అటూ ఇటూ మార్చేసి నాగ్ తో ఆఫీసర్ చేస్తున్నాడనే అనుమానాన్ని వెలిబుచ్చాడు. ఇప్పటికే ఇతను ది డైరెక్టర్ అంటూ ఓ సినిమా చేసేస్తుండగా.. దీన్ని వర్మ ఆఫీసర్ తో పాటే రిలీజ్ చేయనున్నాడు. వర్మపై ఇతను కాపీ ఆరోపణలు చేయడం కొత్తేమీ కాదు. రీసెంట్ సెన్సేషన్ జీఎస్టీ విషయంలో కూడా.. అది తన స్క్రిప్టే అంటూ హంగామా చేశాడు జయకుమార్. ఈ విషయంలో వర్మపై కోర్టులో కేసు వేశాడు కూడా.
ఇప్పుడు మళ్లీ రాంగోపాల్ వర్మ తర్వాతి స్క్రిప్టును కూడా తన కథే అనే అనుమానాన్ని వెలిబుచ్చుతున్నాడు. ఇందులో నిజానిజాల సంగతి తేల్చలేం కానీ.. వర్మపై కాపీ ఆరోపణలు వరుసగా వస్తుండడం గమనించాలి. అయితే.. ప్రస్తుతం శ్రీదేవిని.. ఆఫీసర్ ని మినహాయిస్తే మరే అంశాన్ని పట్టించుకోవడం లేదు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.