కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన 'జయం' రవి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన నిర్మాత ఎడిటర్ మోహన్ కుమారుడే రవి. ఫస్ట్ సినిమా 'జయం' ని ఇంటి పేరుగా మార్చుకున్న రవి.. తెలుగులో 'బావా బావమరిది' 'పల్నాటి పౌరుషం' సినిమాలో నటించాడు. ఇక జయం రవి నటించిన తమిళ సినిమాలు తెలుగులో అనువాదమై మంచి విజయం సాధించాయి. అలాగే ఆయన తమిళంలో చేసిన కొన్ని సినిమాలు తెలుగులో రీమేక్ చేయబడి ఘన విజయం సాధించాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ మూవీ 'ధృవ'.. 'జయం' రవి హీరోగా నటించిన తమిళ్ 'తని ఒరువన్' (2015) చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. 'జయం' రవి - అరవింద్ స్వామి కాంబినేషన్ తో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 'తని ఒరువన్' తర్వాత ‘జయం’ రవి - అరవింద్ స్వామి కాంబోలో వచ్చిన మరో సినిమా ''బోగన్''. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. లిమిటెడ్ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా అక్కడ రూ. 25 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు.
కాగా, ఒక బ్యాంక్ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తూ, ఆదిత్య అనే నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించే విక్రమ్ అనే పోలీసాఫీసర్ కథ 'బోగన్' చిత్రం. తనకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఆదిత్యను ఒక అద్భుత ప్లాన్ తో విక్రమ్ పట్టుకోవడంతో.. కథ ప్రేక్షకులు ఊహించని మలుపులు తిరిగి ఆసక్తికర కథనంతో పరుగులు పెడుతుంది. విక్రమ్ ఐపీఎస్ గా జయం రవి.. ఆదిత్యగా అరవింద్ స్వామి నటించిన ఈ సినిమా ఒక హాలీవుడ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ''బోగన్'' చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో అందిస్తున్నారు. 'బోగన్' లో యాపిల్ బ్యూటీ హన్సికా మొత్వాని హీరోయిన్ గా నటించింది. నాజర్ - పొన్ వణ్ణన్ - నరేన్ - అక్షర గౌడ ఇతర పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చగా.. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇప్పటికే అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయని.. ఎక్కడా డబ్బింగ్ చిత్రమనే అభిప్రాయం కలగకుండా క్వాలిటీతో డబ్ చేశామని నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు. ఈ నెల 26న ఈ చిత్ర ట్రైలర్ విడుదల అవుతుందని.. త్వరలోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు.