తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ. గతంలో ఈయన చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్.. పవన్ కళ్యాణ్ లతో పాటు ఇంకా పలువురు హీరోలతో సినిమాలను తెరకెక్కించి సక్సెస్ లను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్న జయంత్ సి పరాన్జీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఈ దర్శకుడి తండ్రి చంద్రమౌళి తీవ్ర అనారోగ్యంతో నేడు ఉదయం సమయంలో తుది శ్వాస విడిచారు.
92 ఏళ్ల చంద్రమౌళి ప్రముఖ డాక్టర్. జాతీయ స్థాయిలో పలు డాక్టర్స్ అసోషియేషన్స్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ లో కూడా క్రియాశీలక కార్యకర్త గా గతంలో వ్యవహరించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ కు సూపరింటెండెంట్ గా కూడా పని చేశారు. ఎన్నో కీలక కేసులను ఆయన సున్నితంగా డీల్ చేసిన సంఘటనను ఆయన కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు.
చంద్రమౌళి గారికి ముగ్గురు కుమారులు. ఆయన కుమారుల్లో ఒక్కడు జయంత్ సి పరాన్జీ. టాలీవుడ్ లో మంచి దర్శకుడిగా పేరు దక్కించుకున్నారు. జయంత్ కు పితృ వియోగం కలగడంతో టాలీవుడ్ ప్రముఖులు ఆయన్ను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసి చంద్రమౌళి గారి మృతదేహంకు శ్రద్దాంజలి ఘటించారు. మృత దేహంను స్వగృహం కు తీసుకు వెళ్లారు. రేపు అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు.