సినిమా ప్రపంచంలో ఈగోల గోల ఎక్కువ. ఇన్‌సెక్యూరిటీ కూడా ఎక్కువే. అందునా ఇద్దరు కథానాయికల మధ్య ఈ ఈగోలు మరీ ఎక్కువ. అయితే నవతరం నాయికలు ఈ ట్రెండ్‌ని మారుస్తున్నారు. ఒకరితో ఒకరు స్నేహంగా మెలుగుతూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. నాటి మేటి హీరోయిన్లతో పోలిస్తే నేటి హీరోయిన్లలో జెలసీ తక్కువే అని నిరూపిస్తున్నారు. అయితే ఈ జెలసీ కొన్ని అరుదైన సందర్భాల్లో బైటికొస్తుంటుంది. ఇదంతా ఎందుకు మాట్లాడాల్సొచ్చిందంటే.. అలనాటి మేటి నాయిక జయప్రద ఇటీవలే కె.రాఘవేంద్రరావు సౌందర్యలహరి ప్రోగ్రామ్‌లో తన కెరీర్ జ్ఞాపకాల్ని, అనుభూతుల్ని పంచుకున్నారు. ఒకానొక సందర్భంలో ఓ సినిమా షూటింగు వేళ అతిలోక సుందరి శ్రీదేవిని, జయప్రదని కలిపి ఒకే రూమ్‌లో వేసి, కె.రాఘవేంద్రరావు తాళం వేశారు. అయితే ఆ క్షణంలో శ్రీదేవి కానీ, జయప్రద కానీ చొరవ చేసి ఒకరితో ఒకరు మాట్లాడుకోనేలేదట. కనీసం ఒకరి కళ్లలోకి ఇంకొకరు చూసుకోవడానికే ఈగో ఫీలయ్యారట. ఆ విషయాన్ని కెఆర్ సమక్షంలో గుర్తు చేసుకున్నారు. అయితే నవతరంలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అన్న ప్రశ్నకు స్వీటీ అనుష్క అని జయప్రద సమాధానమిచ్చారు. టాలీవుడ్‌లో యువతరానికి డ్రీమ్‌గాళ్ అనుష్క. గొప్పనటి అంటూ జయప్రద కితాబునిచ్చారు.