జయప్రదం అంటున్న అలనాటి అందాల నటి.

Update: 2020-04-04 02:30 GMT
జయప్రద. ఇండియన్ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన గొప్ప నటి. సినీ రంగానికి ఎనలేని మధుర జ్ఞాపకాలు మిగిల్చి ప్రస్తుతం రాజకీయ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఈ రోజు అలనాటి అందాల నటి జయప్రద 58వ పుట్టినరోజు. 1962 ఏప్రిల్ 3న రాజమండ్రిలోని ఒక మధ్య తరగతి కుటుంబం లో జన్మించింది. చిన్నప్పటి నుండి జయప్రద డాక్టర్ కావాలని కలలు కనేదట. కానీ తల్లి కోరిక మేరకు ఏడు సంవత్సరాల వయసు నుండే జయప్రద డాన్స్ మరియు సంగీతంలో శిక్షణ పొందింది. 14యేళ్ళ వయసులో భూమికోసం అనే సినిమాతో తెలుగు సినిమాలోకి ప్రవేశించింది. జయప్రద అసలు పేరు లలితారాణి. సినిమాల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి ఆమె పేరును జయప్రదగా మార్చాడట. అప్పటి నుండి లలితా రాణి కాస్త జయప్రదగా వెలిగిపోతుంది.

జయప్రద తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ బాషలలో కూడా నటించింది. లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే కూడా జయప్రదను చూసి మెచ్చుకున్నారట. సౌత్ లో సెటిల్ అయిన తర్వాత జయప్రద 'సర్గం' సినిమా తో బాలీవుడ్ లో అడుగుపెట్టిందట. హిందీలో అమితాబ్ సరసన నటించిన 'షరాబీ' మూవీ జయప్రదకు విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. జయప్రద బాలీవుడ్ లో ఆనాటి టాప్ హీరోలందరితో నటించి మెప్పించింది. 1994లో జయప్రద రాజకీయాల్లోకి ప్రవేశించింది. తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైన ఆమె రాజకీయ ప్రస్థానం ఆ తర్వాత సమాజ్ వాది పార్టీ వైపు మళ్లింది. అనంతరం రీసెంట్ గా 2019 లో బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీచేసింది. జయప్రద జీవితంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. ఈ రోజు తన 58వ పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానుల నుండి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందుకుంటోంది.
Tags:    

Similar News