కలెక్టర్ పదవిని విడిచిపెట్టి.. ‘లోక్ సత్తా’ సంస్థను ఏర్పాటు చేసి ఆదర్శ రాజకీయాల కోసం.. సుపరిపాలన కోసం పోరాటం చేసిన నాయకుడు జయప్రకాష్ నారాయణ. చాలా ఏళ్ల పాటు ఇలాగే పోరాడి.. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారాయన. రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోయినా జేపీ ముద్ర ప్రత్యేకం. ఆయనకున్న ఇమేజే వేరు. కొన్ని రోజుల కిందట పవన్ కళ్యాణ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిధుల కేటాయింపుకు సంబంధించి పరిశోధించేందుకు జాయింట్ ప్యాక్ట్స్ కమిటీలో పని చేశారాయన. ఇప్పుడు జేపీ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆయన ఒక సినిమా చూసి దానిపై ప్రశంసలు కురిపించడం విశేషం. ఆ సినిమా మరేదో కాదు.. భరత్ అనే నేను.
హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జేపీ ఆదివారం ‘భరత్ అనే నేను’ సినిమా చూసి స్పందించారు. ‘‘ఇప్పుడే నా మిత్రులు.. కుటుంబ సభ్యులు.. సహచరులతో కలిసి ప్రసాద్ ల్యాబ్స్ లో ‘భరత్ అనే నేను’ సినిమా చూశా. దర్శకుడు కొరటాల శివ మాస్ ఎంటర్టైన్మెంట్ ను.. సామాజిక సందేశాన్ని చక్కగా కలగలిపాడు. ప్రజల్ని ఆలోచింపజేశాడు. చట్టాలు.. స్థానిక పాలన గురించి బాగా చెప్పాడు. పాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజాస్వామ్యం ఎలా నడవాలోచూపించాడు’’ అని జేపీ ట్విట్టర్లో పేర్కొన్నాడు. సినిమాలో చూపించిన స్థానిక పరిపాలన.. గ్రామ స్వరాజ్యం లాంటి అంశాలు లోక్ సత్తా ద్వారా జేపీ ప్రతిపాదించినవే. వాటి కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు.