సహజనటి జయసుధకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ నిర్మాత కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి తన బర్త్ డే వేడుకల సందర్భంగా `అభినయ మయూరి` బిరుదును ఇచ్చి సత్కరించారు. ఈ మంగవారం సాయంత్రం విశాఖ పట్నం సుబ్బిరామిరెడ్డి కళా పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో టీఎస్సార్ మాట్లాడుతూ ``సీనియర్ నటి జయసుధ నటనలోకి దిగితే ప్రపంచాన్నే మరిచిపోతారు. ఆమెను అభినయ మయూరి బిరుదుతో సత్కరించడం ఆనందాన్నిస్తోంది. అందం అభినయంతో నాయికగా తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలిన తను అన్నివిధాలా అర్హురాలు. సహజమైన ఫర్మార్మెన్స్ తనకు మాత్రమే చెల్లింది. బయట కూడా విలువలతో అంతే ఒదిగి ఉంటారు. ఎందరికో కెరీర్ లో అవార్డులిచ్చాను. ఇది కళపై ప్రేమతో మాత్రమే`` అని అన్నారు.
టీఎస్సార్ బర్త్ డే వేడుకల్లో జయసుధ ఇచ్చిన స్పీచ్ ఆకట్టుకుంది. తనపై అభిమానంతో విచ్చేసిన తన సోదరి నటీమణులకు జయసుధ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తన స్నేహితురాలు జీవిత గురించి ప్రస్థావిస్తూ తనపై అభిమానాన్ని చూపించడమే గాక.. హీరో రాజశేఖర్ ని పిలుస్తూ రాజశేఖర్ రెడ్డి గారు.. అంటూ తడబాటుకు గురవ్వడం వేదిక వద్ద చర్చకు వచ్చింది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు గుర్తుకొస్తున్నారు ఈ సందర్భంగా.. ఆయన స్ఫురణలో ఉండిపోయారు.. అంటూ జయసుధ ఆ తర్వాత స్పీచ్ ని కొనసాగించారు. అభినయ మయూరి పురస్కార వేడుకలకు భారీగా సీనియర్ సెలబ్రిటీలు .. అన్ని పార్టీల నాయకులు విచ్చేశారు.
ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో సీనియర్ నటి శారద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజశేఖర్-జీవిత జంటతో పాటు జమున- జయప్రద- రాధిక- రోజా విచ్చేశారు. వీరితో పాటు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు.. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. వేదికపై అన్ని పార్టీల నాయకులు ఉన్నారని తనకు పార్టీలతో సంబంధం లేదని టీఎస్సార్ వ్యాఖ్యానించడం ఆసక్తికరం.