సహజ నటి జయసుధ సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తూ వస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా జయసుధ నటిగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఆకట్టుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ఈమద్య కాలంలోనే జయసుధ భర్త నితిన్ కపూర్ చనిపోయారు. ఆ సమయంలోనే జయసుధ తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్నట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియా లో వచ్చాయి
చాలా కాలంగా జయసుధ నిర్మాణ రంగంలో కొనసాగుతూ వచ్చారు. తెలుగు - తమిళం - హిందీ భాషల్లో ఎన్నో చిత్రాలను నిర్మించారు. అందులో ఎక్కువ శాతం జయసుధకు నష్టాలను మిగిల్చాయి. వివాహం సమయంలో నితిన్ కపూర్ తో పోల్చితే జయసుధ వద్ద ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఆస్తులన్ని కూడా నిర్మాణంలో విఫలం అవ్వడం వల్ల మెల్ల మెల్లగా కరుగుతూ పోయాయి. చివరి ప్రయత్నంగా ‘హ్యాండ్సప్’ అనే కామెడీ చిత్రాన్ని జయసుధ నిర్మించింది. జయసుధపై ఉన్న అభిమానంతో ఆ చిత్రంలో చిరంజీవి గెస్ట్ గా నటించాడు.
హ్యాండ్సప్ చిత్రంలో చిరంజీవి ఉన్నాడు అంటూ ప్రచారం చేయడంతో పాటు - పోస్టర్స్ పై చిరంజీవి ఫొటోను పెద్దగా వేశారు. దాంతో సినిమాలో చిరంజీవి ఎక్కువగా కనిపిస్తాడని అంతా ఆశించారు. కాని ప్రేక్షకుల అంచనాలు తారు మారు అయ్యేలా చిరంజీవి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే చిత్రంలో కనిపించడంతో తీవ్రంగా నిరుత్సాహ పడి ప్రేక్షకులు బయటకు వెళ్లారు. అలా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఆ సినిమా నష్టాల దెబ్బకు మొత్తం ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. తాజాగా ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో జయసుధ చెప్పుకొచ్చారు. హ్యాండ్సప్ చిత్రం పోస్టర్ పై చిరంజీవి ఫొటోను వేయకుంటే ఒక మంచి కామెడీ సినిమాగా పేరు తెచ్చుకుని సినిమాకు మినిమం కలెక్షన్స్ వచ్చేవి అని అప్పట్లో కొందరు అన్నారు. అలా చిరు ఫొటో వల్ల సినిమా ఫ్లాప్ అయ్యిందని జయసుధ చెప్పుకొచ్చారు. మెల్లగా కోలుకుంటున్న సమయంలోనే జయసుధ కొడుకుతో సినిమా నిర్మించి మళ్లీ నష్టాలను చవి చూశారు. ఇలా వరుసగా జయసుద చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో నష్టాలే మిగిలాయి.