రామ్ గోపాల్ వర్మ 'శివ' చిత్రం సంచలనాలకు మారు పేరుగా నిలిచింది. ట్రెండ్ సెట్టర్ చిత్రంగా నిలిచిన శివ చిత్రంతో ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. జేడీ చక్రవర్తి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. శివ చిత్రంతో ఒక్కసారిగా జేడీ క్రేజ్ పెరిగి పోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా హీరోగా కూడా చాలా సినిమాలు చేశాడు. తాజాగా ఆలీతో జాలీగా కార్యక్రమంలో పాల్గొన్న జేడీ చక్రవర్తి తన కెరీర్ ఆరంభంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనల గురించి వివరించాడు. ముఖ్యంగా నాగార్జున కాలర్ తాను పట్టుకోవడం.. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోకు చెందిన డ్రైవర్లు నన్ను కొట్టేందుకు రాడ్లు పట్టుకుని రావడం జరిగిందని చెప్పుకొచ్చాడు.
'శివ' సినిమా మొదటి రోజు చిత్రీకరణలో నేను పాల్గొంటున్నాను. ఆ రోజు పటాన్ చెర్వులోని ఒక ఇరానీ కేఫ్ లో చిత్రీకరణ జరపాలని వర్మ భావించాడు. అయితే అక్కడ జనాలు బాగా ఎక్కువగా ఉండటం వల్ల షూటింగ్ కు పదే పదే అంతరాయం కలుగుతుంది. దాంతో షూటింగ్ అని తెలియకుండా వర్మ ప్లాన్ చేశాడు. అక్కడ షూట్ జరుగుతుందని నలుగురు అయిదుగురికి తప్ప ఎక్కువ మందికి తెలియకుండా కెమెరా ఏర్పాటు చేశాడు.
నేను ఇరానీ కేఫ్ లోంచి బయటకు వెళ్తున్నాను. అప్పుడే ఎదురుగా వస్తున్న నాగార్జున భుజం తగిలింది. అప్పుడే ఆయన ఏయ్ ఎటు చూసి నడుస్తున్నావ్ అంటూ నన్ను కోపగించుకున్నాడు. తగిలిన వెంటనే సారీ చెప్పాలని తెలియదా అంటూ నాపై కోపంతో మండి పడ్డాడు. అప్పుడు నేను మర్యాదగా మాట్లాడండి అంటూ సీరియస్ అవ్వడంతో నాగార్జున నా చెంపపై ఒక్కటి ఇచ్చాడు. దాంతో వెంటనే నేను ఆయన షర్ట్ కాలర్ పట్టుకున్నాను. ఆయన కూడా నా షర్ట్ కాలర్ పట్టుకున్నాడు. అక్కడ జరుగుతున్నది నిజమైన గొడవ అనుకుని కొందరు కంగారు పడగా.. అన్నపూర్ణ స్టూడియోస్ కు చెందిన వారు కొందరు నన్ను కొట్టేందుకు రాడ్లను కూడా తీసుకు వచ్చారు. ముందుకు వస్తున్న వారిని నాగార్జున ఆపేశాడు. ఆ తర్వాత అది షూట్ అని వర్మ చెప్పాడు. వర్మ వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది. కాని ఆయన చేసిన పనికి కాస్త అయితే నన్ను ఏసేసేవారు అని జేడీ నవ్వులు పూయించాడు.