మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి హాట్ చర్చలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తామని నలుగురు ముందుకు రావటం తెలిసిందే. అధ్యక్ష స్థానాన్ని కోరుతున్న ప్రకాశ్ రాజ్ మిగిలిన వారి కంటే ముందున్నారు. ‘మా’ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించటంతో పాటు.. తాను పోటీ చేయనున్నట్లుగా ప్రకాశ్ రాజ్ చెప్పిన తర్వాత పలు పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.
కన్నడిగు అయిన ప్రకాశ్ రాజ్.. తెలుగు సినిమా రంగానికి చెందిన ‘మా’కు అధ్యక్షుడు ఎలా అవుతారన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. ఆయన్ను నాన్ లోకల్ గా వ్యాఖ్యలు చేయటంపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశాన్ని తీవ్రంగా తప్పుపడుతూ శుక్రవారంప్రకాశ్ రాజ్ తన టీంలోని కొందరితో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించటం తెలిసిందే.
ప్రకాశ్ రాజ్ మీద పోటీ చేయనున్నట్లు ప్రకటించిన జీవితా రాజశేఖర్ తాజాగా ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. హాట్ టాపిక్ గా మారిన ‘నాన్ లోకల్’ ఇష్యూ మీద స్పందించారు. ‘ప్రకాశ్ రాజ్ ను కొందరు నాన్ లోకల్ గా అభివర్ణించటం నాకు నచ్చలేదు. ‘మా’ కుటుంబంలోకి ఎవరికీ నచ్చలేదు. మా పిల్లలు తమిళంలో నటిస్తున్నారు. వారు అక్కడ నాన్ లోకల్ అవుతారా? అనేక మంది కన్నడ హీరోయినట్లు తెలుగులో నటిస్తున్నారు. వారు నాన్ లోకల్ అవుతారా?’’ అని ఆమె సూటిగా ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు.. తనకు అధ్యక్ష పదవిని అప్పజెప్పాలన్న అంశానికి సంబంధించి సమర్థవంతమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ‘మా’లో దాదాపు 350 మంది మహిళా సభ్యులు ఉన్నారని.. వారిలో ఆపీస్ బేరర్లు చాలా తక్కువన్నారు. ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు కాలేదని.. గతంలో పెద్దలంతా ఒకమహిళా అధ్యక్షురాలు కావాలని ఆకాంక్షించారన్నారు. ఆ రోజు కూడా రావాలి’’ అంటూ ఆమె చేసిన వాదన చూస్తే.. తానుబరిలో నిలవటం వెనుక సహేతుకమైన కారణం ఉందన్నట్లుగా ఆమె మాటలు ఉన్నాయి.