టైర్ బ‌ర‌స్ట్ ..అందుకే మేజ‌ర్ ప్ర‌మాదం!

Update: 2019-11-13 07:19 GMT
హీరో రాజశేఖర్‌కు ఔట‌ర్ లో పెను ప్రమాదం తప్పిన సంగ‌తి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కార్ అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్ రోడ్డు పై బోల్తా పడింది. శంషాబాద్ మండ‌లం గోల్కండ అప్పా జంక్ష‌న్ ద‌గ్గ‌ర ఈ ప్ర‌మాదం జ‌రిగింది. రామోజీ ఫిలిం సిటీ నుంచి  ఒంటి గంట ప్రాంతంలో ఇంటి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంత‌రం రాజశేఖర్ వేరొక‌రి సాయంతో ఇంటికి తిరిగి వ‌చ్చారు. టీఎస్‌ 07 ఎఫ్‌జెడ్‌ 1234 నెంబరు కలిగిన లగ్జరీ కార్ ప్రమాదానికి గురైన‌ట్టు తాజాగా రివీలైన వీడియో ఒక‌టి చెబుతోంది.

అయితే ఈ ప్ర‌మాదంపై పూర్తి వివ‌ర‌ణ ఇచ్చేందుకు తాజాగా జీవిత రాజ‌శేఖ‌ర్ మీడియాకు ఓ వీడియో బైట్ ని పంపించారు. జీవిత మాట్లాడుతూ.. ``టీవీలు వెబ్ సైట్ల‌లో ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. నిన్న రాత్రి 1.30 స‌మ‌యంలో కార్ లో వ‌స్తున్నారు. కారు టైర్ బ్లాస్ట్ అయ్యి కంట్రోల్ త‌ప్ప‌డంతో ఒక‌వైపు ప‌డిపోయింది. అక్క‌డ ఆపోజిట్ లో వ‌స్తున్న కార్ వాళ్లు రాజ‌శేఖ‌ర్ ను కార్ నుంచి బ‌య‌ట‌కు తీశారు. వారి ఫోన్ తీసుకునే పోలీసుల‌కు స‌మాచారం అందించి అలాగే మాకు కూడా ఫోన్ చేశారు. రాత్రి ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌టి నుంచి పోలీసుల‌కు పూర్తిగా అందుబాటులో ఉండి జ‌రిగిన విష‌యాన్ని వెల్ల‌డించాము. రాజ‌శేఖ‌ర్ పెద్ద ప్ర‌మాదం నుంచే త‌ప్పించుకున్నారు. ఇది మేజ‌ర్ యాక్సిడెంట్. అయితే చిన్న గాయాల‌తోనే త‌ప్పించుకోగ‌లిగారు. ముఖంపై చిన్న స్క్రాచ్ మిన‌హా వేరే గాయాలేవీ అవ్వ‌లేదు`` అని తెలిపారు. ఉద‌యం నుంచి ఈ వార్త విన్న అభిమానులు కంగారు ప‌డి నాకు ఫోన్లు చేశారు. అందుకే ఈ వివ‌ర‌ణ ఇస్తున్నాను. ఆయ‌న‌ను అభిమానుల ప్రార్థ‌న‌లే కాపాడాయ‌ని జీవిత వీడియో ముఖంగా అన్నారు.

ఈ ప్ర‌మాదం కేవ‌లం కార్ టైర్ బ‌ర‌స్ట్ అవ్వ‌డం వ‌ల్ల‌నే జ‌రిగింద‌ని జీవిత వెల్ల‌డించారు. దీనిపై పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించామ‌ని తెలిపారు. స్పాట్ లో పోలీస్ విచార‌ణ సాగింద‌ని రాజ‌శేఖ‌ర్ క్షేమంగా ఉన్నారా? అని పోలీసులు ప్ర‌శ్నించార‌ని జీవిత తెలిపారు. అయితే ఈ ప్ర‌మాదంలో రాజ‌శేఖ‌ర్ తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపైనా స‌రైన వివ‌ర‌ణ ఇస్తారేమో చూడాలి.
Tags:    

Similar News