మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. సహజనటి జయసుధ పేరు ఇటీవల ప్రముఖంగా వినిపిస్తోంది. క్రమశిక్షణా కమిటీ పెద్దలు చిరంజీవి- మోహన్ బాబు ఇరువురు జయసుధను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా కథనాలొచ్చాయి.
ఆసక్తికరంగా సహజనటి జయసుధను ఏకగ్రీవం చేసినా చేయకపోయినా పోటీ బరిలో మరో మహిళ జీవిత రాజశేఖర్ కూడా ఉన్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే జీవిత కూడా బలమైన అభ్యర్థిగా ఉంటారని తాజాగా ఊహాగానాలు సాగుతున్నాయి. అందుకు సహేతుక కారణం నందమూరి కాంపౌండ్ లో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీపరిశ్రమ పెద్దల్లో ఒకరిగా నందమూరి బాలకృష్ణ తనవంతు సపోర్ట్ ని జీవితకు ఇస్తున్నారని తెలుస్తోంది.
ప్రకాష్ రాజ్ కి చిరు మద్ధతునిస్తుండగా.. మంచు విష్ణుకి కృష్ణ-కృష్ణంరాజు మద్ధతు ఉంది. జీవితకు బాలయ్య నుంచి మద్ధతు ఉంటుందని చెబుతున్నారు. చిరు తరువాత MAA ఎన్నికలలో ప్రభావితం చేయగల ప్రధాన మద్దతుదారు నందమూరి బాలకృష్ణ. కానీ ఆయన మంచు విష్ణుకు మద్ధతునివ్వకపోగా జీవితకు అనుకూలంగా మద్ధతునిస్తారన్న చర్చా వేడెక్కిస్తోంది.
ఇక మా డైరీ లాంచ్ లో రాజశేఖర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్న చిరు నుంచి జీవితకు ఎలానూ సపోర్ట్ ఉండదన్న చర్చా సాగుతోంది. అయితే అదే పాయింట్ బాలయ్య వారితో కలవడానికి లేదా సపోర్టు నివ్వడానికి కారణమవుతుందని ఊహాగానాలు సాగిస్తున్నారు. అయితే ఎవరు పోటీలో ఉన్నా ఏకగ్రీవంతో చెక్ పెట్టేందుకు జయసుధ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారని ఒక సెక్షన్ ప్రచారం చేస్తోంది. సెప్టెంబర్ లో మా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు నెలల ముందే బోలెడంత రచ్చ సాగుతోంది. బాలయ్య మద్ధతు మంచు కాంపౌండ్ కి లేని పక్షంలో జయసుధ పేరును తెరపైకి తేవడమే ఉత్తమమని కొందరు విశ్లేషిస్తున్నారు.