అజ్ఞాతవాసి డీల్ సెటిల్ కాలేదా?

Update: 2018-01-22 04:38 GMT
పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి పై నెలకొన్న కాపీ వివాదం ఇంకా చల్లారలేదనే సంగతి వెల్లడి అవుతోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్నప్పటి నుంచి కాపీ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. త్రివిక్రమ్ సినిమాల్లో కొన్ని సన్నివేశాలను రీరైట్ చేయించడం వంటివి కనిపించినా.. థీమ్ ను ఛేంజ్ చేయడం జరుగుతుంది.

అందుకే ఇది పెద్ద వివాదంగా మారుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ అనుకోకుండా ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ డైరెక్టర్ జెరోమ్ సలే రంగంలోకి దిగడంతో సీన్ లో మార్పు వచ్చింది. అజ్ఞాతవాసి రిలీజ్ కు ముందు నుంచి ఈ చిత్రంపై ట్వీట్స్ చేస్తూనే ఉన్న జెరోమ్.. లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీ అని రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా చెప్పేశాడు. అయితే.. లార్గో వించ్ రైట్స్ టీ సిరీస్ దగ్గర ఉన్నపుడు.. టీసిరీస్ తో అజ్ఞాతవాసి మేకర్స్ సెటిల్మెంట్ చేసుకున్నపుడు.. ఇంకా వివాదం ఏముంటుందో అంతు చిక్కడం లేదు. ఇదే విషయాన్ని జెరోమ్ ని ప్రశ్నించాడు ఓ వ్యక్తి.

ఓ భాషలో హక్కులు కొనుక్కున్నపుడు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసుకునే రైట్స్ ఉండవా అంటే.. 'నో' అంటూ జెరోమ్ సలే ఆన్సర్ ఇచ్చాడు. దీంతో అజ్ఞాతవాసిపై చర్యలు తీసుకునేందుకు జెరోమ్ సలే చాలా సీరియస్ గానే ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. టీసిరీస్ తో డీల్ విషయంపై కూడా అనుమానాలు వస్తూనే ఉన్నాయి. అసలు అజ్ఞాతవాసిపై నెలకొన్న కాపీ వివాదానికి సెటిల్మెంట్ అనేదే జరగలేదా? లేదంటే సెటిల్మెంట్ అయినట్లు ఈ దర్శకుడికి తెలియదా??
Tags:    

Similar News