రొమాంటిక్ గీతం.. ప్రణయ గీతం.. విరహ గీతం .. సందర్భం ఏదైనా.. బాణి ఏదైనా కిక్కు రావాలంటే మ్యాస్ట్రో ఇళయరాజా రోజులకే వెళ్లాలి. ఇంకాస్త అడ్వాన్స్ డ్ గా వెళితే.. ఓసారి మణిరత్నం.. రెహమాన్ కాంబో క్లాసిక్స్ వినాల్సిందే. ఇప్పటికీ మెజారిటీ పార్ట్ అభిరుచి ఉన్న శ్రోతలు ఇళయరాజా క్లాసిక్స్.. మణిరత్నం .. ఏ.ఆర్.రెహమాన్ కలెక్షన్స్ ని దాచి పెట్టుకుని వింటారు. అలాంటి వాళ్లకు రుచించేలా నేటితరం స్వరాలు ఉంటున్నాయా? అంటే పెదవి విరిచేసే వాళ్లే ఎక్కువ. ఉంటే ఆ రేంజును మించి ఉండాలి. కనీసం వాటిని తలపించేలా అయినా ఉండాలి. అలా వద్దనుకుంటే అంతకుమించి చూపించాలి. ముఖ్యంగా మెలోడీని .. రొమాంటిక్ గీతాన్ని హైలెవల్లో ఊహించుకునే వాళ్లే ఎక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
నవతరం సంగీత దర్శకుల్లో అత్యంత ప్రతిభావంతుడిగా పాపులారిటీ తెచ్చుకున్న అనిరుధ్ ఓ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే దానిపై భారీ అంచనాలుంటాయి. ఇదివరకూ పవన్ .. త్రివిక్రమ్ ల అజ్నాతవాసి చిత్రానికి అనిరుధ్ అద్భుతమైన బాణీలే ఇచ్చాడు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. అందులో మ్యూజిక్ ఫెయిల్ కాలేదన్న ప్రశంసలొచ్చాయి. ముఖ్యంగా మెలోడీ, ర్యాప్.. ఫాస్ట్ బీట్ ప్రతిదీ అదరగొట్టాడు. అందుకే ఇప్పుడు నాని జెర్సీ కి మ్యూజిక్ ఇస్తున్నాడు అనగానే ఈ పాటలపైనా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
తొలిగా జెర్సీ నుంచి `ముద్దు పెట్టనా ఊపిరి పైనే ....` అంటూ సాగే రొమాంటిక్ నంబర్ ని రిలీజ్ చేశారు. ఈ పాట ఎత్తుగడ అద్భుతం. అయితే క్రమక్రమంగా బాణీ లోనికి వెళ్లే కొద్దీ అదుపు తప్పిందా? అనిపిస్తుంది. మెలోడీని ర్యాప్ తో మిక్స్ చేసిన విధానం ఆకట్టుకోలేదు. ఆహ్లాదకరమైన ట్యూన్ కుదిరినా అన్నీ సమపాళ్లలో కుదరలేదని అనిపిస్తుంది. రొమాంటిక్ మూడ్ ని క్యారీ చేసినా ఇంకా ఏదో మిస్సయ్యిందే అని అనిపించక మానదు. క్లాసిక్స్ చెలి, సఖి రేంజు రొమాంటిక్ బీట్ ఊహించుకుంటే మాత్రం కష్టం. ఇక ఇతర బాణీలు ఎలా ఉండనున్నాయో చూడాలి. నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే జెర్సీ టీమ్ ప్రచారంలో వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే.
Full View