న్యాచురల్ స్టార్ నాని హీరోగా మళ్ళి రావా ఫేం గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించిన జెర్సీ ట్రైలర్ ఇందాకా విడుదలైంది. ఎలాంటి దాపరికం లేకుండా స్ట్రెయిట్ గా కథలో కీ పాయింట్ మొత్తం ట్రైలర్ లో చెప్పేశారు. అర్జున్(నాని)ఉత్సాహవంతుడైన క్రికెటర్. ప్రేమించిన అమ్మాయి(శ్రద్ధ శ్రీనాథ్)ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ దాంపత్యానికి గుర్తుగా ఓ మగ బిడ్డ పుడతాడు. కాని ఈ పదేళ్ళ కాలం అర్జున్ కెరీర్ ని మార్చేస్తుంది.
తనకు ప్రాణమైన క్రికెట్ దూరమవుతుంది. ఇంట్లో ఖర్చులు పెరిగిపోయి ఉద్యోగం లేక భార్య జీతం మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో కలిసిన కోచ్(సత్యరాజ్)ఇచ్చిన స్ఫూర్తితో మళ్ళి గ్రౌండ్ లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతాడు. 36 ఏళ్ళు వచ్చిన వాడితో ఆట ఏంటి అనే హేళన ఎదురవుతుంది. అయినా భయపడకుండా అర్జున్ తన సత్తా చాటేందుకు సిద్ధ పడతాడు. భార్య నమ్మకాన్ని కోల్పోయినా కొడుకు కోసం లక్ష్యాన్ని ఎర్పరుచుకుంటాడు. అది ఎలా చేశాడు అన్నదే జెర్సీ
స్టొరీ పరంగా క్లారిటీ ఇవ్వడమే కాదు ఇందులో ఎంత బలమైన ఎమోషన్స్ ఉన్నాయో చూపించే ప్రయత్నం కూడా ట్రైలర్ లో చేశారు. రెండు గెటప్స్ లో నాని మేకోవర్ చాలా బాగుంది. జీవితంలో ఓడిపోయి ఆఖరికి భార్య చేతిలో అవమానాల పాలై తన పర్సులో డబ్బులు కూడా దొంగతనం చేసే స్థితికి దిగజారాల్సి రావడం నాలుగు డబ్బుల కోసం అందరిని అప్పు అడుగుతూ తిరగడం ఇవన్ని హృదయాన్ని ఎక్కడో తాకేవే.
మొత్తానికి జెర్సీని ఎమోషన్స్ తో నింపేశారు. శ్రద్ధా శ్రీనాథ్ కూడా మంచి ప్రతిభ కనబరిచింది. సను జాన్ కెమెరా అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ థీమ్ ని బాగా ఎలివేట్ చేశాయి. నాని ఫ్యాన్స్ కే కాదు ఇలాంటి ఎమోషనల్ జర్నీస్ ఇష్టపడే ప్రతిఒక్కరిని ఆకట్టుకోవడంలో జెర్సీ ట్రైలర్ సక్సెస్ అయ్యింది
Full View