అక్కాచెల్లెళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారే

Update: 2017-04-16 04:17 GMT
బాలీవుడ్లో ఎప్పుడు తెరంగేట్రం చేస్తారో తెలియని ఈ అక్కాచెల్లెళ్లు.. బయట పార్టీల్లో మాత్రం ఆల్రెడీ తెరంగేట్రం చేసేసి నానా హంగామా చేసేస్తున్నారు. ఈపాటికే మీకు ఆ సెక్సీ బ్యూటీలు ఎవరో అర్ధమైందిగా. ఆల్రెడీ కరీనా-కరిష్మా.. శిల్పా శెట్టి- షమిత.. మలైకా అరోరా-అమృత.. వంటి భామలు బాలీవుడ్ ను అలరించాక ఇప్పుడు జాన్వి కపూర్ అండ్ ఖుషీ కపూర్ ఆ ప్లేసు తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నట్లున్నారు.

ఏ పెళ్ళిలో చూసినా.. అంబానీల ప్రైవేట్ పార్టీలో చూసినా.. ఇప్పుడు జాన్వి అండ్ ఖుషీ తమ అందంచందాలతో తడిపేస్తున్నారు అంతే. అదిగో నిన్న కూడా ఈ అక్కాచెల్లెళ్ళిద్దరూ ఒక పార్టీలో పైన ఫోటోలో కనిపించిన విధంగా తెగ రెచ్చిపోయారు. అదేంటమ్మా భామలూ అంత హాటుగా ఉన్నారు అంటే.. మేమేదో నాటీగా వచ్చేశాం అంతే.. దీన్ని హాటంటారాని మాకు తెలియదు అంటూ ఈ భామలు ఛమత్కరించేశారు. కాకపోతే జాన్వి స్పీడు చూస్తుంటే మాత్రం ఎప్పుడెప్పుడు వెండితెర నుండి కబురొస్తుందా అంటూ ఆరాటంగా ఉన్నట్లు అనిపిస్తోంది కదూ.

ఇకపోతే.. జాన్వి తెరంగేట్రం చేసే సినిమా విషయమై ఆమె లాంచింగ్ ను కరణ్‌ జోహార్ చేతిలో పెట్టాలని శ్రీదేవి ఆలోచిస్తుంటే.. తన పెద్ద కూతురు డెబ్యూ సినిమా తనే ప్రొడ్యూస్ చేసి.. లాభాలన్నీ కొట్టేయాలని చూస్తున్నాడు బోని కపూర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News