సూర్య.. అతడి పేరు వింటే అతడి సినిమాలు సాధించిన రికార్డులు గుర్తుకురావు. అతను చేసిన విలక్షణ పాత్రలు గుర్తుకు వస్తాయి. అతడికి కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్లోనూ ప్రత్యేకంగా అభిమానులున్నారు. గజనీ సినిమా ఇక్కడ కూడా వందరోజులు ఆడింది. తమిళనాడులో తనకన్నా సీనియర్ నటులైన విజయ్, అజిత్ నెంబర్ వన్ రేసులో నువ్వానేనా అన్నట్లు ఉన్నా.. తెలుగులో మాత్రం వాళ్ళిద్దరి కంటే సూర్యకే ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా సూర్య సుధా కొంగర దర్శకత్వంలో ' ఆకాశమే నీ హద్దు రా' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రేపు అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల అవుతోంది.
ఈ సందర్భంగా సూర్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ' ఆకాశమే నీ హద్దురా.. సినిమా స్పైస్ జెట్ విమాన సంస్థ అధినేత కెప్టెన్ గోపినాథ్ జీవితంలోని ముఖ్య సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఒక సామాన్య ఉపాధ్యాయుడి కుమారుడు దేశంలోనే ప్రముఖ వైమానిక రవాణా సంస్థకు ఎలా అధినేత గా ఎదిగాడు. కేవలం ఒక్క రూపాయి తీసుకుని సామాన్య ప్రజలను విమానం ఎలా ఎక్కించారు. వంటి ముఖ్య సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది అందరికీ కచ్చితంగా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. దర్శకురాలు సుధ కొంగర యువ సినిమా షూటింగ్ నుంచే తెలుసు. సీన్ల విషయంలో ఆమె టార్చర్ పెడుతుంది. సీన్ బాగా వచ్చే దాకా వదలదు. ఓ రకంగా చెప్పాలంటే ఆమె డ్రిల్ మాస్టర్ లాగా వ్యవహరిస్తుంది. సినిమా మంచి ఫీల్ అవుట్ పుట్ వచ్చింది' అని సూర్య చెప్పుకొచ్చాడు.
సినిమాల కంటే ముందు చిన్న ఉద్యోగం చేశా
సూర్య సినిమాల్లోకి రాకముందే ఒక చిన్న ఉద్యోగం చేశాడు. ఇప్పుడంటే అతడు స్టార్ హీరో అయ్యాడు.. గానీ అతడు చిన్న ఉద్యోగం ద్వారా అందుకున్న తొలి జీతం మాత్రం రూ. ఏడు వందలే. కష్టం విలువ అంటే ఏంటో తెలియజేసినందుకే మా నాన్న ఓ చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేర్పించారని, తన తొలి సంపాదనగా రూ.700 అందుకున్నట్లు సూర్య చెప్పారు.