పొలిటిక‌ల్ సెటైర్ కి 'జోహార్' అనాలేమో

Update: 2020-01-30 02:30 GMT
చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ముందుకొస్తోంది అభిషేక్ పిక్చ‌ర్స్. గూఢ‌చారి- రాక్ష‌సుడు- ఇస్మార్ట్ శంక‌ర్  లాంటి విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల్ని ఈ సంస్థ పంపిణీ చేసింది. అలాగే ప్రెజ‌ర్ కుక్క‌ర్ లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని ఈ సంస్థ భాగ‌స్వాముల‌తో క‌లిసి నిర్మించింది. తాజాగా అభిషేక్ పిక్చర్స్ `జోహార్` మూవీ రిలీజ్‌ హక్కులను దక్కించుకుంది.

దీంతో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న ఈ సంస్థ మ‌రో ఆస‌క్తిక‌ర‌ మూవీని రిలీజ్ చేస్తోందా? అన్న ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తిక‌రం. ఐదు పాత్రల చుట్టూ తిరిగే రాజకీయ వ్యంగ్యాస్త్ర‌మిద‌ని తెలుస్తోంది.ఈ చిత్రానికి తేజా మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో `దృశ్యం` ఫేమ్ ఎస్తేర్ అనీల్ ఓ ప్ర‌ధాన పాత్ర‌ధారి. సీనియర్‌ నటి ఈశ్వరి రావు.. చైతన్య కృష్ణ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియదర్శన్ సంగీతం అందిస్తుండ‌గా.. జగదీష్ చీకాటి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. వేసవి కానుక‌గా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ధర్మ సూర్య పిక్చర్స్ బ్యానర్ ఆధారం భాను సందీప్ మార్ని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌ థియేట్రిక‌ల్.. నాన్-థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా చేజిక్కించుకున్నారు. విడుదల తేదీని నిర్మాత‌లు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు. చిన్న సినిమాల‌కు బ‌డా నిర్మాణ సంస్థ‌లు పంపిణీ సంస్థ‌లు అండ‌గా నిల‌వ‌డం అన్న‌ది కంటెంట్ ప‌రంగా బెట‌ర్ మెంట్ కి సాయం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ కోవ‌లోనే జోహార్ నిలుస్తుందేమో చూడాలి.


Tags:    

Similar News