హాలీవుడ్ నటుడు జానీ డెప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఈయన తన భార్య అంబర్ హెర్డ్ తో ఇటీవలే విడాకులు తీసుకున్నాడు. జానీ డెప్ డ్రగ్స్ తీసుకుంటాడు.. చిన్న విషయాలకు పెద్ద గొడవ చేసి కొడతాడు అంటూ మరి కొన్ని విషయాలను కోర్టు లో తెలియజేసి అంబర్ హెర్డ్ విడాకులు పొందింది.
విడాకుల విచారణ సమయంలో తనకు అలవాటు లేని డ్రగ్స్ అలవాటు ఉన్నట్లుగా తప్పుడు విషయాలు చెప్పడంతో పాటు ఇంకా తన పరువు తీసిందని అంబర్ హెర్డ్ పై జానీ డెప్ పరువు నష్టం దావా వేశాడు. అంబర్ పై 50 మిలియన్ల పరువు నష్టం దావాను జానీ డెప్ వేయగా అందుకు బదులు అన్నట్లుగా అంబర్ కూడా జానీ డెప్ పై ఏకంగా 100 మిలియన్ ల పరువు నష్టం దావా వేసింది.
తన గురించి తప్పుడు విషయాలు ప్రచారం చేసి తన పరువు తీస్తున్నాడు అంటూ ఆమె పేర్కొంది. వీరిద్దరి పరువు నష్టం కేసులు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల అంబర్ హెర్డ్ మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అయిన కొత్తలో జానీ డెప్ టాటూల గురించి ప్రశ్నించిన సమయంలో కొట్టాడు. అతడి చేయి పై ఉన్న టాటూ ఏంటని అడిగాను. అప్పుడు వినో అంటూ సమాధానం ఇచ్చాడు. అది ఏదో ఫన్నీ పదం అనుకుని నవ్వాను.
నేను నవ్వినందుకు నా మొహం పై పిడిగుద్దులతో దాడి చేశాడు. ఆ సమయంలో ఎంతగా విజ్ఞప్తి చేసినా ఆగలేదు అంది. అతడు ఎందుకు అలా కొడుతున్నాడో నాకు అర్థం కాక అలాగే నిలబడి పోయాను అంది. ఆ తర్వాత కూడా చాలా సార్లు నన్ను మొహం మీద ఇష్టానుసారంగా పిడిగుద్దులతో దాడి చేశాడంటూ ఆరోపించింది. ఈ ఆరోపణలపై జానీ డెప్ స్పందన ఏంటీ అనేది చూడాలి.