జూ.బెల్లంకొండ‌-కృతి జంట‌గా `వివాహ్` రీమేక్

Update: 2021-05-16 17:30 GMT
నిర్మాత బెల్లంకొండ ఇద్ద‌రు వార‌సులు సినీహీరోలుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.  బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఇప్ప‌టికే నిరూపించుకున్నాడు. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. అత‌డి సోద‌రుడు గ‌ణేష్ ప్ర‌స్తుతం హీరోగా తెరంగేట్రం చేసే  ప‌నిలో ఉన్నాడు.

గణేష్ హీరోగా మొద‌లైన‌ తొలి చిత్రం ఆగిపోయింద‌ని ప్ర‌చార‌మైనా.. ఇప్పుడు అత‌డి లాంచింగ్ పై సురేష్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `వివాహ్`ను తెలుగులో రీమేక్ చేయడానికి బెల్లంకొండ సురేష్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే వివాహ్ రీమేక్ హక్కులను కూడా కొనుగోలు చేశారు. ఈ చిత్రంలో ఉప్పెన‌ ఫేమ్ కృతి శెట్టి  క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఇంకా ద‌ర్శ‌కుడిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సంవత్సరం ఎండింగ్ లో సినిమాని ప్రారంభిస్తార‌ని తెలిసింది.

షాహిద్ కపూర్- అమృత రావు ముఖ్య పాత్రల్లో నటించిన వివాహ్ 2006 లో రిలీజైంది. సూరజ్ బర్జాత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామాతో అన్నివ‌ర్గాల ఆడియెన్ ని అల‌రించింది. ఇప్ప‌టికే  గణేష్ మొట్టమొదటి చిత్రం ఒక షెడ్యూల్ చేసి కూడా వ‌దిలేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌రోవైపు బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే ధ‌నుష్ క‌ర్ణ‌న్ రీమేక్ లోనూ న‌టిస్తాడు.
Tags:    

Similar News