ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రణం రుధిరం). 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవలే రిలీజ్ చేసిన 'నాటు నాటు' పాట సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ గీతాన్ని కాలభైరవ - రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఎంతో హుషారుగా ఆలపించారు. దీనికి చరణ్ - తారక్ వేసిన డ్యాన్స్ మూవ్స్ హైలైట్ గా నిలిచాయి.
ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్ ఊర నాటు స్టెప్పులతో ఇరగదీశారనే చెప్పాలి. సినిమాలో స్నేహితులుగా నటిస్తున్న తారక్ - చరణ్.. ఒకరినొకరు పట్టుకుని వేసే లెగ్ మూమెంట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇద్దరి మధ్య ఆ సమన్వయంతో పాటు డ్యాన్స్ లో సింక్ ఉండటంతో ఈ సాంగ్ వీక్షకులకు కనులవిందుగా అనిపించింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని కవర్ సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. అయితే 'నాటు నాటు' పాట క్రెడిట్ మొత్తం దర్శకుడు జక్కన్న వల్లే అని ఎన్టీఆర్ చెబుతున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తారక్.. ''నాటు నాటు పాటలో కాళ్ళను ఎడమ, కుడి వైపుకు.. అలాగే ముందుకు వెనక్కి తిప్పే స్టెప్స్ ఉంటాయి. దాని కోసం మేము టేకుల మీద టేకులు తీసుకున్నాం. ఆ మూమెంట్ పర్ఫెక్ట్ రావడానికి దాదాపు15 నుంచి 18 టేక్స్ తీసుకున్నాం. ఈ పాటలో 'సింక్' కనిపించట్లేదని రాజమౌళి మా ఇద్దరికీ చూపించాడు. స్టెప్ రికార్డ్ చేస్తూ.. 'కాళ్లేంటి అలా కదుపుతున్నారు.. చేతులు అలాగేనా తిప్పేది.. ముందుకు వెళ్ళండి వెనక్కి ఉండండి' అని ఏదొకటి అంటూనే ఉండేవారు. ఆ చిన్న మూమెంట్ కోసం ఒక రోజంతా టైం పట్టింది'' అని తెలిపారు.
సాంగ్ లో ఆ స్టెప్పులు సింక్ అవ్వడం కోసం రాజమౌళి ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారని అనుకున్న ఎన్టీఆర్.. 'నాటు నాటు' పాట విడుదలైన తర్వాత దానికి వస్తున్న రెస్పాన్స్ చూసి దాని ప్రభావాన్ని గ్రహించానని చెప్పారు. ''పాట విడుదలైనప్పుడు ఆన్ లైన్ లో అందరూ సింక్ గురించే మాట్లాడుతున్నారు. నేను రాజమౌళికి కాల్ చేసి 'మీకు ఇది ముందే ఎలా తెలుసు?' అని అడిగా. అతను టాస్క్ మాస్టర్. భారతదేశంలోని అతిపెద్ద దర్శకులలో ఒకరిగా ఉన్నారు. అందుకే ఈ రోజు ఆ పాట వైరల్ అవుతోంది'' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
కాగా, RRR చిత్రాన్ని అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చరణ్ కు జోడీగా అలియా భట్ - తారక్ సరసన ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ - సముద్రఖని - శ్రియా ఇతర కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 7న అత్యధిక స్క్రీన్స్ లలో ట్రిపుల్ ఆర్ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.