తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశమే గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి చిత్రంతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా సాధ్యం కాని అద్బుత రికార్డులను దక్కించుకున్నాడు. ప్రస్తుతం జక్కన్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' ను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకున్న క్రేజ్ మరియు ఈ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ మరియు చరణ్ ల లుక్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే తాపత్రయం అందరిలోనూ కనిపిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఈ సినిమాకు లీక్ ల బెడద తప్పడం లేదు.
గతంలో రాజమౌళి తెరకెక్కించిన మగధీర నుండి బాహుబలి వరకు దాదాపు అన్ని సినిమాలకు కూడా లీక్ లు తెగ ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు కూడా ఆర్ఆర్ఆర్ చిత్రం లీక్ లు జక్కన్నకు చిరాకు పెడుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని నిమిషాల నిడివి కలిగిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఎన్టీఆర్ లుక్ కు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంతగా సెక్యూరిటీ పెంచినా కూడా షూటింగ్ లొకేషన్స్ లో లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ వద్ద అయినా కూడా షాట్స్ లీక్ అవుతూనే ఉన్నాయి.
ఎన్టీఆర్ సీన్ ఒకటి లీక్ అవ్వడంతో జక్కన్న చాలా సీరియస్ అయ్యాడు. పోస్ట్ ప్రొడక్షన్ టీంపై కఠిన చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ దెబ్బతో మరింతగా సెక్యూరిటీని పెంచినట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో చరణ్ లుక్ ను రివీల్ కాకుండా చూసుకునేందుకు జక్కన్న చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
ఒక వైపు కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. మరో వైపు నటీనటుల విషయం సినిమాకు సంబంధించి ఇంకా ఎన్నో విషయాలపై శ్రద్ద పెట్టడంతో పాటు ఈ లీక్ ల విషయమై కూడా జక్కన్న దృష్టి పెట్టాల్సి రావడంతో ఆయనకు టార్చర్ గా ఉందంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సరదా అనుకుని తెలియకుండానే కొందరు లీక్ కు పాల్పడుతున్నారు. ఇక పై అయినా వారు ఇలాంటి పనులు ఆపేస్తే జక్కన్న ఆర్ఆర్ఆర్ ను మరింత అద్బుతంగా చిత్రీకరిస్తాడంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.