ఇద్దరు హీరోయిన్లతో ఎన్టీఆర్ రచ్చ

Update: 2016-08-09 13:34 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జంటగా సమంత-నిత్యామీనన్ లు నటించిన మూవీ జనతా గ్యారేజ్. ఇచట అన్ని రిపేర్లు చేయబడును అనే క్యాప్షన్ కూడా తగిలించుకున్న ఈ సినిమా షూటింగ్.. ఇపుడు దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా కేరళ వెళ్లి పాటలు పాడుకున్న హీరో హీరోయిన్ల ఫోటోలను పోస్టర్ల రూపంలో విడుదల చేసింది జనతా గ్యారేజ్ యూనిట్.

ఆగస్ట్ 12న జనతా గ్యారేజ్ ఆడియో విడుదల చేయనున్న సందర్భంగా.. ఆడియో లాంఛ్  పోస్టర్లను ఇచ్చారు. ఇందులో కేరళ అందాల మధ్యలో పరిగెడుతున్న హీరో హీరోయిన్స్ ఉంటారు. పొట్టి డ్రస్ వేసుకుని సమంత.. స్లీవ్ లెస్ డ్రస్ లో నిత్యా మీనన్ లు పరిగెడుతుంటే.. మధ్యలో గోపాలుడు ఉరుకులు పరుగులు పెడతున్నాడు. ఎన్టీఆర్ డ్రసింగ్ కూడా చాలా కొత్తగా ఉందిలే.

కేరళలో ఎన్నో అందాలు ఉండగా.. వాటి మధ్య ఈ ఇద్దరు అందాల భామలను పరిగెట్టించిన పోస్టర్ సూపర్ గా వచ్చింది. ఇప్పటివరకూ ఎన్టీఆర్ ని సీరియస్ లుక్ లో చూపించగా.. ఈ సారి రొమాంటిక్ రచ్చ చేస్తున్న ఫోటో కూడా రావడంతో.. అభిమానులు తెగ సంతోషించేస్తున్నారు. ఇద్దరు భామలతో అక్కడ ఎన్టీఆర్ రచ్చ చేస్తే.. ఆడియో రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ రచ్చ మొదలైపోయింది.
Tags:    

Similar News