చిరు..బన్నీలతో పాటు ఎన్టీఆర్‌ కూడా నేర్చుకుంటున్నాడట!

Update: 2020-04-22 07:50 GMT
సెలబ్రెటీలు ఈ లాక్‌ డౌన్‌ పీరియడ్‌ ను ఒకొక్కరు ఒక్కో విధంగా వినియోగించుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది ఏదో ఒక కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఈ ఖాళీ సమయంను వినియోగించుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కొందరు మాత్రం పూర్తిగా ఫ్యామిలీకి సమయంను కేటాయించి ఎంజాయ్‌ చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఈ ఖాళీ సమయంను తన మనవళ్లు మనవరాళ్లను చూసి స్పానిష్‌ నేర్చుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఆన్‌ లైన్‌ ద్వారా స్పానిష్‌ లాంగ్వేజ్‌ ను చిరంజీవి నేర్చుకుంటున్నాడు.

అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రం కోసం చిత్తూరు యాస తెలుగును నేర్చుకుంటున్నాడు. హీరోయిన్‌ రష్మిక మందన్న కూడా పుష్ప చిత్రం కోసం చిత్తూరు యాసతో తెలుగు నేర్చుకుంటున్న విషయం తెల్సిందే. ఇక నిధి అగర్వాల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సును నేర్చుకుంటున్నట్లుగా చెప్పింది. తాజాగా ఎన్టీఆర్‌ కూడా నేర్చుకునే పనిలో పడ్డట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ మలయాళం భాషను ఆన్‌ లైన్‌ ద్వారా నేర్చుకుంటున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఆన్‌ లైన్‌ లో పాఠాలు వినడంతో పాటు.. రోజుకు ఒకటి రెండు మలయాళి సినిమాలను ఎన్టీఆర్‌ చూస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ.. తమిళం.. మలయాళం.. కన్నడంలో విడుదల చేయబోతున్నారు. జక్కన్న సూచన మేరకు అన్ని భాషల్లో కూడా హీరోలు స్వయంగా డబ్బింగ్‌ చెప్పాలనుకుంటున్నారట.

తెలుగు.. కన్నడం.. హిందీ.. తమిళ భాషలను బాగానే మాట్లాడే ఎన్టీఆర్‌ కు మలయాళం భాష కాస్త ఇబ్బందిగా ఉందట. అందుకే ప్రస్తుతం ఈ ఫ్రీ టైంను మలయాళం నేర్చుకునేందుకు ఎన్టీఆర్‌ కేటాయించినట్లుగా చెబుతున్నారు. ఇద్దరు కొడుకులతో ఎన్టీఆర్‌ ఎంజాయ్‌ చేయక ఈ మలయాళం గొడవ ఎందుకు పాపం అంటు కొందరు అభిమానులు అంటున్నారు. మరికొందరు మాత్రం ఎన్టీఆర్‌ డెడికేషన్‌ గ్రేట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News