Jr ఎన్టీఆర్.. మీరు మారిపోయారు సార్!

Update: 2022-09-03 07:30 GMT
RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంత జాగ్రత్తగా మారిపోయాడు అంటే తన తదుపరి సినిమా స్క్రిప్ట్ విషయంలో ప్రతి ఒక్క మూమెంట్ కూడా అద్భుతంగా ఉండాలి అనే విధంగా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అసలే రాజమౌళి సక్సెస్ అందుకున్న తర్వాత ఏ హీరో అయినా సరే డిజాస్టర్ ఎదుర్కోవాల్సిందే అనే బ్యాడ్ సెంటిమెంటు ఆచార్యతో మరింత బలంగా మారిపోయింది. కాబట్టి ఎన్టీఆర్ కొంచెం కూడా రిస్కు తీసుకోకుండా ముందుకు సాగాలి అని అనుకుంటున్నాడు.

ఇక కొరటాల శివ ఇప్పటికే ముందు అనుకున్న ఒక ప్రాజెక్టును పక్కనపెట్టి మళ్ళీ ఎన్టీఆర్ కోసం మరొక కథను లైన్లోకి తీసుకువచ్చినట్లు టాక్ అయితే వినిపిస్తోంది.

ఇక అది ఎంతవరకు నిజం అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ కోసం సరికొత్త లుక్ తో కనిపించబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా కొరటాల శివ హీరోలను లౌడ్ గా చూపించకుండా చాలా సెటిల్డ్ గా క్లాస్ గానే ప్రజెంట్ చేస్తూ హై వోల్టేజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలని అనుకుంటాడు.

జనతా గ్యారేజ్ లో ఇదివరకే ఎన్టీఆర్ లో చాలా సింపుల్ గా ఒక నేచర్ లవర్ ను చూపించాడు. ఇక ఇప్పుడు రాబోయే సినిమాల్లో మాత్రం కాస్త వైల్డ్ గానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ కాస్త బరువు తగ్గినట్లు తెలుస్తోంది.

గత నెలలో ఎన్టీఆర్ అమిత్ షాను కలిసినప్పుడు కాస్త చబ్బీగా కనిపించినట్లు అనిపించింది. ఇక రీసెంట్ గా బ్రహ్మస్త్ర ప్రెస్మీట్లో ఎన్టీఆర్ ఆ లుక్ లో కొంత మార్పు తెచ్చినట్లు అనిపిస్తోంది. అటు ఇటుగా ఎన్టీఆర్ మరీ లావుగా ఉండకుండా.. మరీ బక్కగా ఉండకుండా మిడ్ రేంజ్ లోనే ఒక లుక్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది.

ఏదేమైనా కూడా ప్రస్తుతం బ్రహ్మాస్త్ర ఈవెంట్లో పాల్గొన్నప్పుడు ఎన్టీఆర్ లు లీక్ మాత్రం ఓ వర్గం వారిని ఎంతగానో కట్టుకుంటుంది. మరి కొరటాల.. ఎన్టీఆర్ ను ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News