యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లానింగ్ అంతా తారుమారైందా? తాను ఒకటనుకుంటే మరొకటి జరుగుతోందా? పరిస్థితి అంతా తన చేతుల్లో ఉన్నట్లు అనిపించినా ప్రాక్టికల్ గా అలా సాధ్యపడలేదా? దీంతో టైగర్ ఒత్తికి గురవుతున్నాడా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఉప్పెన` దర్శకుడు బచ్చిబాబుతో చేయాల్సిన ప్రాజెక్ట్ చివరి నిమిషంలో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
ఎక్కడ తేడా జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా ఆ కథ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వద్దకు వెళ్లింది. కొన్ని రకాల మార్పులతో ఆ కథని చరణ్ తో తీస్తున్నాడాయన. అటు టైగర్ ల్యాండ్ మార్క్ మూవీ 30వ సినిమా విషయంలో చోటు చేసుకు్న జాప్యం గురించి చెప్పాల్సి న పనిలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన కొన్నినెలలు గడుస్తున్నా ఇంకా కొరటాల చిత్రాన్ని సెట్స్ కి తీసుకెళ్లలేదు.
ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని పరిస్థితి. అటు ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా అంతకంతకు ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్- ప్రభాస్ హీరోగా `సలార్` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒక భాగంలో కథని చెప్పడం వీలు కాకపోవడంతో రెండు భాగాలుగా రెడీ చేస్తున్నట్లు సమాచారం.
అదే జరిగితే ప్రశాంత్ నీల్ వచ్చే ఏడాది కూడా రెండవ భాగం షూట్ లో బిజీగా ఉంటారు. దాదాపు ఆ ఏడాది అంతా షూట్ కి సరిపోతుంది. ఆ రకంగా టైగర్ చేతుల్లో నుంచి ప్రశాంత్ నీల్ చేజారే అవకాశం ఉంది. ఈ గ్యాప్ ని ముందే ఊహించిన గురూజీ త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట.
ఓ పెద్ద నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలన్నది ఆయన ప్లాన్ గా సమాచారం. ఈ నేపథ్యంలో తారక్ సైతం గందరగోళానికి గురవుతున్నాడుట. తాను ఒకటనుకుంటే మరొకటి జరుగుతుందని తల పట్టుంకుటున్నాడుట. అన్ని తన చేతుల్లోనే ఉన్నట్లు అనిపించినా తీరా ఆ సన్నివేశం వచ్చే సరికి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఎదురవుతుందంటున్నారు. ఇదంతా తారక్ పై మానసింకగానూ ఒత్తిడికి గురి చేస్తుందని ప్రచారం సాగుతోంది.