శిరీష్ ని ఆడుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

Update: 2023-01-11 14:30 GMT
రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన పాన్ ఇండియా వండ‌ర్ `RRR`. అసాధ్యం అనుకున్న క‌ల‌యిక‌ని సుసాధ్యం చేస్తూ నంద‌మూరి హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా హీరో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఇండియ‌న్ సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ గ‌త ఏడాది మార్చిలో విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

వ‌సూళ్ల ప‌రంగానూ స‌రికొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. సినిమా రిలీజ్ కి ముందు ట్రైల‌ర్ రిలీజ్ నుంచి మెగా, నంద‌మూరి అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియా వార్ మొద‌లైంది. సినిమాలో మా హీరో నే గొప్ప అంటే మా హీరోనే గొప్ప అంటూ ఇద్ద‌రు హీరోల అభిమానులు నెట్టింట అగ్లీ వార్ కు తెర‌లేప‌డం తెలిసిందే. సినిమా రిలీజ్ కు ముందు సినిమాలో చ‌ర‌ణ్ కు అధిక ప్రాధాన్య‌త నిచ్చారని, మా హీరో పాత్ర‌ని త‌గ్గించార‌ని రాజ‌మౌళిపై విరుచుకుప‌డ్డారు.

ఇప్పుడు మ‌రోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. `RRR` ప్ర‌తిష్టాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజిన‌ల్ మ్యూజిక్ విభాగంలో అవార్డుని దక్కించుకున్న విష‌యం తెలిసిందే. అమెరికాలో జ‌రిగిన అవార్డు వేడుక‌లో `RRR` టీమ్ రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, కీర‌వాణి త‌దిత‌రులు పాల్గొన్నారు. `RRR` కు `నాటు నాటు` సాంగ్ కు గానూ బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్ విభాగంతో అవార్డు ద‌క్క‌డంతో చిత్ర బృందంపై ప‌లువురు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా అంద‌రిలాగే హీరో అల్లు శిరీష్ కూడా `RRR`టీమ్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేసి నెటిజ‌న్ ల‌కు అడ్డంగా దొరికిపోయాడు. ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ లో @AlwaysRamCharan
 @ssrajamouli @mmkeeravaani #NTRJr  @RRRMovie ఇలా ట్యాగ్ చేసిన శిరీష్ .. యంగ్ టైగ‌ర్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ని త‌ప్పుగా ట్యాగ్ చేయ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు శిరీష్ ని ఆడుకోవ‌డం మొద‌లు పెట్టింది. కొంత మంది ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ తెలియ‌దా అంటూ మండిప‌డుతుంటే మ‌రి కొంత మంది ఫ్యాన్స్ శిరీష్ పై బూతుల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీంతో శిరీష్ ట్వీట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News