2020 సంవత్సరం ఆరంభం నుండి మొన్నటి వరకు బాలీవుడ్ లో విడుదల అయిన హిందీ సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఒక మోస్తరు సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాలు పది ఇరవై కోట్లు రాబట్టడానికి కూడా కింద మీద పడ్డాయి. గత రెండున్నర సంవత్సరాలుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హిందీ సినిమాలు చాలా పూర్ పర్ఫార్మెన్స్ ను ఇస్తున్నాయి.
మరో వైపు సౌత్ సినిమాలు అయిన ఆర్ ఆర్ ఆర్.. పుష్ప.. కేజీఎఫ్ 2 ఇంకా కొన్ని సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్ 2 అక్కడి రికార్డులన్నింటిని బ్రేక్ చేసిన విషయం తెల్సిందే. వందల కోట్ల వసూళ్లను సౌత్ సినిమాలు రాబడుతూ ఉంటే హిందీ సినిమాలు మాత్రం పాతిక కోట్లు రాబట్టడం గగనంగా మారింది.
హిందీ ఫిల్మ్ మేకర్స్ అంతా కూడా బిక్కు బిక్కుమంటూ తమ సినిమాల పరిస్థితి ఏంటో అన్నట్లుగా ఆందోళనతో ఉన్నారు. ఎట్టకేలకు హిందీ బాక్సాఫీస్ కు కళ వచ్చింది. ఇటీవల విడుదల అయిన రెండు చిన్న హిందీ సినిమా లు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించాయి. కాస్త బాక్సాఫీస్ వద్ద గల గల అనిపించడంతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఊపిరి పీల్చుకుంటూ హమ్మయ్య అంటున్నారు.
అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ముఖ్యంగా పృథ్వీరాజ్ సినిమా వందల కోట్ల బడ్జెట్ తో రూపొంది కనీసం 50 కోట్ల వసూళ్లను సాధించలేక పోయింది. 500 కోట్ల టార్గెట్ తో విడుదల అయిన పృథ్వీరాజ్ సినిమా మరీ దారుణంగా 50 కోట్ల వద్ద ఆగడంతో పరిస్థితి అక్కడ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పాజిటివ్ టాక్ దక్కించుకున్న సినిమాలకు కూడా దారుణమైన వసూళ్లు నమోదు అయ్యాయి. దాంతో వసూళ్లు మళ్లీ పుంజుకోవు.. ఓటీటీ కి ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు అనుకుంటున్న సమయంలో తాజాగా వచ్చిన జగ్ జగ్ జియో సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం మొదలు పెట్టింది. కియారా అద్వానీ.. వరుణ్ దావన్.. అనీల్ కపూర్.. నీతూ కపూర్ లు నటించిన ఈ సినిమా కు మొదటి మూడు రోజుల్లో దాదాపుగా 30 కోట్ల వరకు వసూళ్లు నమోదు అయ్యాయి.
ఈ కలెక్షన్స్ సౌత్ సినిమాలకు చాలా తక్కువే. వీటినే బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల వారు చాలా పెద్ద వసూళ్లు గా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భావిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ బాక్సాఫీస్ గాడిన పడుతున్న నేపథ్యంలో ఫిల్మ్ మేకర్స్ మరియు ప్రొడ్యూసర్స్ ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.