జూన్ లో బిగ్ మూవీస్, క్రేజీ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేశాయి. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత నటించిన 'విక్రమ్', అడివి శేష్ నటించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ 'మేజర్' మూవీలతో జూన్ నెల బాక్సాఫీస్ సందడి మొదలైంది. ఇక ఆ తరువాత వచ్చిన నేచురల్ స్టార్ నాని 'అంటే సుందరానికి', రానా దగ్గుబాటి, సాయి పల్లవి కలిసి నటించిన 'విరాటపర్వం' థియేటర్లలో పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాయి.
దీంతో అందరి దృష్టి జూలై నెలపై పడింది. జూన్ లో సందడి చేసిన చిత్రాల్లో 'మేజర్', విక్రమ్ బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేశాయి. ఇందులో 'మేజర్' స్ట్రెయిట్ మూవీ, విక్రమ్ డబ్బింగ్ ఫిల్మ్. దీంతో ఇప్పడు అంతా జూలై లో విడుదలయ్యే స్ట్రెయిట్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. జూల 1న విడుదలైన 'పక్కా కమర్షియల్' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మారుతి తెరకెక్కించిన ఈ మూవీపై హీరో గోపీచంద్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ వాటిని ఏ స్థాయిలోనూ ఈ మూవీ అందుకోలేకపోయింది.
ఈ మూవీ తరువాత జూలైలో ముగ్గురు క్రేజీ హీరోలు ఉస్తాద్ రామ్, మాస్ మహారాజా రవితేజ, నాగచైతన్య నటించిన సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ప్రస్తుతం అందరి చూపు ఈ మూడు చిత్రాలపైనే వుంది. ఈ నెల గోపీచంద్ శుభారంభాన్ని అందించకపోవడంతో రామ్ నటిస్తున్న 'ది వారియర్' పై అందరి చూపు పడింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. 'పందెం కోడి' ఫేమ్ ఎన్.లింగుస్వామి చాలా రోజుల తరువాత డైరెక్ట్ చేసిన సినిమా కావడం, రామ్ తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
ఇది మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ యావరేజ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేస్తుంది. అందుకే ట్రేడ్ వర్గాలు సైతం జూలై 14న విడుదల కానున్న 'ది వారియర్' కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ తరువాత జూలై 22న అక్కినేని నాగచైతన్య నటించిన 'థాంక్యూ' రిలీజ్ అవుతోంది. ఇది పక్కా క్లాస్ అండ్ సాఫ్ట్ మూవీ. యూత్ ని ఆకట్టుకునే అంశాల ప్రధానంగా సాగే సినిమా ఇది. విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. యూత్ ని ఆకట్టుకుంటేనే ఈ మూవీ నిలబడుతుంది. లేదంటే కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ఇక ఇదే వరుసలో జూలై 29న మాస్ మహారాజా రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రకరకాల వార్తల కారణంగా నిత్యం వార్తల్లో నిలిచింది. పైగా టీజర్ పవర్ ఫుల్ గా వుండటం, రవితేజ క్యారెక్టర్ ని మలిచిన తీరు మాస్ మహారాజా ప్రేక్షకులకు నచ్చేలా వుంది. 'క్రాక్'తో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ కు 'ఖిలాడీ' పెద్ద ఝలకిచ్చింది. అయితే రామారావుతో మళ్లీ సక్సెస్ డ్యూటీ ఎక్కడం ఖాయం అని చెబుతున్నారు.
ఈ నెలకు 'పక్కా కమర్షియల్'తో శుభారంభాన్ని ఇస్తాడనుకున్న గోపీచంద్ నీరుగార్చడంతో ఇప్పడు జూలై సమరం రామ్, నాగచైతన్య, రవితేజల మధ్య సాగబోతోంది. అయితే ఈ పోటీలో ఇద్దరు గెలుస్తారా? లేక ముగ్గురు హీరోలు విజయం సాధిస్తారా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.