ఓటరు జాబితాలో ఉన్న బోగస్ ఓటర్లను తొలగించిన తర్వాతే 'మా' ఎన్నికలు నిర్వహించాలని జూనియర్ ఆర్టిస్టుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. అక్టోబర్ 10న జరిగే ఎన్నికల్లో 3609 మంది జూనియర్ ఆర్టిస్టులు ఓటు హక్కు కలిగి ఉన్నారని.. అయితే ఓటరు జాబితాలోని పేర్లున్న వారికి ఫోన్లు చేస్తే చాలా మంది తాము యూనియర్ సభ్యులం కాదని చెబుతున్నారని ఆరోపించారు. ఇంకొందరు అయితే సమాధానం చెప్పడానికి కూడా నిరాకరిస్తున్నారని జూనియర్ ఆర్టిస్టుల సంఘం నేతలు రవీందర్ సంకూరి, రమావేణి, అశోక్ బెజవాడ తదితరులు శుక్రవారం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బైలాస్ కు విరుద్ధంగా పనిచేస్తున్న వల్లభనేని అనిల్ కుమార్, స్వామిగౌడ్, సినీ పరిశ్రమకు సంబంధం లేని శేషగిరిరావు నామినేషన్ ను రద్దు చేయాలని జూనియర్ ఆర్టిస్టుల సంఘం డిమాండ్ చేశారు. ఓటర్ లిస్ట్ ను సరిచేసి ఎన్నికలు నిర్వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత సెప్టెంబర్ నెలలో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశం జరిగిందని.. అక్టోబర్ 10న ఎన్నికలు జరుపుతున్నట్టు ఆరోజు ప్రకటించలేదని ఎజెండా యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగిందని.. అక్టోబర్ 10న ఎన్నికలు జరుపుతున్నట్లు ఆరోజు ప్రకటించలేదని పేర్కొన్నారు.
ఎజెండా లేకుండానే కేవలం నాలుగు రోజుల ముందు నోటీస్ బోర్డుపై వివరాలు ఉంచారని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్.కే మల్లిక అనే జూనియర్ ఆర్టిస్ట్ ,జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనియన్ లో రికార్డులు అడిగితే ఇవ్వడం లేదని..వాటిని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
జూనియర్ ఆర్టిసుల యూనియన్ నుంచి 1600 కార్డులలో 720 కార్డుల సభ్యుల నుంచి ఒక్కొక్కరికి రూ.25వేలు కార్డు రెన్యూవల్ పేరుతో సుమారు రూ.1.80 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారని.. బైలాస్ కు విరుద్ధంగా ఎలా వసూలు చేశారని ఫిర్యాదులో ప్రశ్నించారు.
ఆడిటింగ్ వివరాలు ఇవన్నీ తనిఖీ చేసుకునే అవకాశం జూనియర్ ఆర్టిస్టులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.