వేసవిలో ఒళ్లు ఝలదరించే ట్రీటుంది అంటూ జురాసిక్ వరల్డ్ టీమ్ ఇంతకుముందు ప్రచారం చేసింది. ఊపిరి బిగబట్టి.. గుండె కొట్టుకుంటుందో లేదో చెక్ చేసుకుని మరీ మా సినిమా చూడాలి... ఉత్కంఠ అడ్వెంచర్ ఇందులో ఉంది.. అంటూ తొలి ట్రైలర్ వేళ ప్రకటించింది. సంచలనాల జురాసిక్ వరల్డ్ సిరీస్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియెన్ కి నచ్చుతాయి. కానీ ఈసారి ఫ్రాంఛైజీలో కొత్త సినిమా అంత కిక్కిస్తుందా లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది.
తాజాగా జురాసిక్ వరల్డ్ - డొమినియన్ నుంచి రెండో ట్రైలర్ విడుదల కాగా ఇందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏముంది? అంటూ డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు చూసిన సినిమాల తీరుగానే ఈసారి కూడా టెక్నాలజీ గ్లింప్స్ తో అదే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది. భారీ డైనోసార్లు ఫ్యామిలీని వెంటాడుతుంటే పుట్టుకొచ్చే దడ ఎలా ఉంటుందో ఈసారి కూడా చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కథ- కథనం ఇతర సినిమాలతో పోలిస్తే ఎంత కొత్తగా ఉంటాయి? అన్నది మూవీ విజయానికి చాలా ఇంపార్టెంట్. ట్రైలర్ లలో ఏమంత కొత్తగా కనిపించలేదు. జురాసిక్ పార్క్.. జురాసిక్ వరల్డ్ సిరీస్ లలో ఇప్పటికే ఈ తరహా థ్రిల్స్ ని ఎన్నో చూశామని విశ్లేషిస్తున్నారు.
వరుసగా హాలీవుడ్ సినిమాలు భారతదేశంలో అతి భారీ రిలీజ్ లతో సంచలనాలుగా మారుతున్నాయి. కోట్లాది రూపాయల మార్కెట్ ని కొల్లగొడుతున్నాయి. ఇంతకుముందు కరోనా క్రైసిస్ లోనూ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' అద్భుతాలు సృష్టించింది. ఈ మూవీ తర్వాత భారతీయ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కి సిద్ధమైన భారీ చిత్రం 'జురాసిక్ వరల్డ్ డొమినియన్'. యూనివర్సల్ పిక్చర్స్ నుండి వస్తున్న డైనోసార్-నేపథ్య చలనచిత్రాల చివరి భాగం ఇది. దీనిని ఎపిక్ ముగింపు అని చెబుతున్నారు. భారీ తారాగణం భారీ విజువల్ ఎఫెక్ట్స్ ట్రైలర్1 ఇంతకుముందు విడుదలైంది. జురాసిక్ వరల్డ్ డొమినియన్ బ్లాక్ బస్టర్ కొడుతుందా లేదా? అన్నది ఇప్పటికి అంచనా వేయలేం. తాజాగా వచ్చిన ట్రైలర్ 2లో కొత్తగా ఏమీ కనిపించకపోవడమే దీనికి కారణం. అయితే ట్రైలర్ వన్ లో విషయాలనే రిపీటెడ్ గా చూపించారంటే ఇందులో ఏదీ రివీల్ చేయడం లేదని కూడా భావించాలి.
ఈ చిత్రం జూన్ 10న భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జూన్ భారతీయ చిత్రాలకు అలాగే డైనోసార్ల సినిమాకు కేరాఫ్ గా మారింది. ఈ సీజన్ లో పరీక్షలు ముగించుకుని పిల్లలు పెద్దలతో కలిసి సినిమాలు వీక్షిస్తారు. అది కలెక్షన్లకు కలిసి రానుంది.
ఇక ఈ సినిమాలో క్రూరాతిక్రూరమైన డైనోసార్లతో హీరో చెలిమి.. కిడ్స్ అసాధారణ విన్యాసాలు వగైరా రిపీటెడ్ గా కనిపిస్తాయని అర్థమవుతోంది. లాస్ ఏంజిల్స్ - వెనిస్ వంటి కొన్ని అందమైన నగరాల కనెక్టివిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నగరాల్లోకి డైనోసార్ లను తీసుకు రావడం అతి భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటోంది. జూన్ 2022 లో మన దేశంలో ఇతర పెద్ద సినిమాలు విడుదలయ్యే ఛాన్సుంది. పోటీ ఉన్నా లేకపోయినా జురాసిక్ వరల్డ్ డొమినియన్ భారీగా విడుదల కానుందిట.
జురాసిక్ వరల్డ్ తర్వాత అవతార్ 2
అవతార్ మూవీ కోసం పండోరా గ్రహాన్ని సృష్టించి లెజెండరీ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. ఈ చిత్రాన్ని చూసిన జనం ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ చిత్రానికి వరుసగా సీక్వెల్స్ ని సిద్ధం చేస్తున్నారు జేమ్స్ కామెరూన్. ఆయన ఈసారి అద్భుతాన్ని ఆవిష్కరించనున్నారు.. అవతార్ ని ఓ రేంజ్ లో చూపించిన ఆయన సీక్వెల్స్ ని అండర్ వాటర్ లో ప్లాన్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. 'అవతార్ 2' 2022 డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ క్రేజీ సీక్వెల్ కి సంబంధించిన దృశ్యాలని న్యూజిలాండ్ లోని అండర్ వాటర్ లో షూట్ చేసారు. ఇందులో చాలా అండర్ వాటర్ సీక్వెన్స్ ని షూట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. అండర్ వాటర్ లో చిత్రీకరించిన స్టంట్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయనున్నాయనేది ఒక టాక్. ఈ చిత్రం కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిన టీమ్ అ టెక్నాలజీతో నీటి అడుగుల సరికొత్త అవతార్ ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో చిత్రీకరణ చేయడం ఆసక్తికరం. ప్రస్తుతం సినిమా కాన్ ఉత్సవాల్లో అవతార్ 2 ట్రైలర్ ని ప్రదర్శించనున్నారని టాక్. ఆ తర్వాత వారానికి యూట్యూబ్లో నూ అవతార్ 2 ట్రైలర్ 1 వస్తుందని టాక్ ఉంది.
Full View