మంచి సినిమా అయినంత మాత్రాన మంచి కలెక్షన్లు వస్తాయని అనుకోవడానికేమీ లేదు. ప్రశంసలు.. వసూళ్లు రెండూ దక్కే సినిమాలు కొన్నే ఉంటాయి. ‘జ్యో అచ్యుతానంద’ ఆ కోవలోకే వస్తుంది. ఈ సినిమాపై క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. మౌత్ టాక్ కూడా బాగుంది. అలాగే కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా క్లాస్ సినిమాలకు పట్టం కట్టే అమెరికన్ తెలుగు ఆడియన్స్.. ఈ సినిమాను చాలా బాగా ఆదరిస్తున్నారు. ప్రిమియర్ల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. దాదాపుగా బ్రేక్ ఈవెన్ స్థాయికి వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా 4 లక్షల డాలర్లకు పైనే వసూలు చేసింది.
సెకండ్ వీకెండ్లో హాఫ్ మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టబోతున్న ‘జ్యో అచ్యుతానంద’కు.. రెండో వారంలో స్క్రీన్లు కూడా పెరుగుతుండటం విశేషం. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు నిర్మాత సాయి కొర్రపాటికి ఫోన్లు చేసి తమ ప్రాంతంలోనూ షోలు వేయాలని డిమాండ్ చేస్తున్నారట. దీంతో రెండో వారాంతానికి స్క్రీన్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. దాదాపు తెలుగు వారుండే అన్ని ఏరియాల్లోనూ జ్యో అచ్యుతానంద ప్రదర్శితం కాబోతోంది. ఈ శుక్రవారం నిర్మలా కాన్వెంట్ మినహా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం ‘జ్యో అచ్యుతానంద’కు కలిసొచ్చే అంశం. ఫుల్ రన్లో ఈ సినిమా 7 లక్షల డాలర్ల దాకా వసూలు చేయొచ్చని అంచనా.