నారా రోహిత్.. నాగశౌర్య.. రెజీనా కసాండ్రాలు నటించిన జ్యో అచ్యుతానంద.. రిలీజ్ కి రెడీ అయిపోయింది. సెప్టెంబర్ 9న ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ చేయించేశారు దర్శక నిర్మాతలు. సెన్సార్ వారు ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చేయడం విశేషం.
ట్రైలర్ చూస్తుంటేనే జ్యో అచ్యుతానంద ఓ రొమాంటిక్ మూవీ అనే విషయం అర్ధమైపోతోంది. పైగా ఫుల్ ప్లెడ్జెడ్ గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కానీ ఈ మూవీ దర్శకుడు అవసరాల శ్రీనివాస్ అనే విషయం గుర్తుంచుకోవాలి. క్లీన్ కామెడీలు చేయడం.. తీయడంలో మహా దిట్ట ఈ డైరెక్టర్. అందుకే రొమాంటిక్ సినిమా తీసేసి కూడా క్లీన్ U సర్టిఫికేట్ సంపాదించేయగలిగాడు. అన్నాదమ్ములు ఇద్దరూ కలిసి.. ఓ లేడీ డెంటిస్ట్ కి లైన్ వేయడం అనే పాయింట్ చుట్టూనే ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. అయితే.. ఇద్దరిలో ఎవరికి హీరోయిన్ దక్కుతుందనే విషయం సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది లెండి.
అటు హీరో హీరోయిన్స్ తో పాటు.. ఇటు దర్శక నిర్మాతలు కూడా జ్యో అచ్యుతానందపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే జనతా గ్యారేజ్ లాంటి భారీ చిత్రం థియేటర్స్ లో ఉన్నా.. రిలీజ్ చేసేందుకు ఏ మాత్రం సందేహించడం లేదు. కళ్యాణ్ కోడూరి సంగీతం జ్యో అచ్యుతానందకు ప్లస్ పాయింట్ గా చెప్పాలి.