నగ్నంగా అమ్మాయిలకు తలలు తీసేసి.. స్టార్ హీరోయిన్ల ముఖం పెట్టి.. వాటిని ప్రచారంలోకి తెచ్చి పైశాచిక ఆనందం పొందే వారు ఇంటర్నెట్ లో కోకొల్లలుగా ఉంటారు. కాస్త ఫేమ్ హీరోయిన్లందరికీ ఈ ఇబ్బంది తప్పదు. ఇలాంటి వాటిని హీరోయిన్లు పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. ఐతే కేరళకు చెందిన జ్యోతికృష్ణ అనే హీరోయిన్ విషయంలో మరీ తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం జరుగుతుండటంతో ఆమె స్పందించక తప్పలేదు. నాలుగైదేళ్ల పాటు మల్లూవుడ్ లో హవా సాగించిన జ్యోతి కృష్ణ గత కొన్ని నెలలుగా సినిమాలు చేయట్లేదు. ఆమె కెరీర్ దాదాపుగా ముగిసినట్లే భావిస్తున్నారు.
ఐతే కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ అమ్మాయి ఫొటోల్ని మార్ఫింగ్ చేసి కొన్ని పోర్న్ సైట్లలో పెట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. అవి ఇంటర్నెట్లో బాగా ప్రచారంలోకి వచ్చేశాయి. జ్యోతికృష్ణ పేరు కొడితే న్యూడ్ ఫొటోలు దర్శనమిస్తుండటం.. సోషల్ మీడియాలో కూడా ఆ ఫొటోలు వైరల్ అవుతుండటంతో జ్యోతికృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ ఫొటోలు ఒరిజినల్ అన్న తరహాలో చాలా తెలివిగా ఎఫెక్టులు ఇవ్వడంతో ఆమె ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ముందు ఈ ఫొటోల గురించి లైట్ తీసుకున్న జ్యోతికృష్ణ.. దుష్ప్రచారం మరీ తీవ్ర స్థాయిలో జరుగుతుండటంతో దిద్దుబాటు చర్యలకు దిగింది. తానంటే గిట్టనివారు ఎవరో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ సైట్స్ లో పెట్టారని మండిపడింది. తనకు మానసిక వేదన కలిగించిన వారికి తగిన బుద్ధి చెప్పనునట్టు ఫేస్ బుక్ లో ఆమె ఓ పోస్టు కూడా పెట్టింది. తన ప్రతిష్ఠకు భంగం కలిగించిన వ్యక్తులను వదిలిపెట్టేది లేదన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తనలాంటి బాధితుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తానన్నారు. పోలీసుల సాయంతో దోషులెవరో కనిపెట్టి వారికి శిక్ష పడేలా చేస్తానని జ్యోతికృష్ణ ప్రకటించింది.