టీజ‌ర్ టాక్ః దోసెల గోల భ‌లే ఉందే

Update: 2017-02-04 18:46 GMT
ఎప్పుడో సినిమాల‌కు గుడ్ బాయ్  చెప్పేసిన జ్యోతిక ఇప్పుడొచ్చి రీఎంట్రీ ఇస్తానంటే జ‌నాల‌కు ఏమంత ఆస‌క్తి క‌ల‌గ‌లేదు. ఆమె రీఎంట్రీ మూవీ ‘36 వ‌య‌దినిలే’ ప‌ర్వాలేద‌నిపించింది త‌ప్ప పెద్ద ఇంపాక్ట్ ఏమీ వేయ‌లేదు. ఇక ఆమె త‌ర్వాతి సినిమాకు ‘మ‌గ‌లిర్ మ‌ట్టుం’ (ఆడాళ్లు మాత్రమే) అనే టైటిల్ పెట్టేస‌రికి ఇదేదో ఆడాళ్లు వాళ్ల హ‌క్కుల మీద న‌డిచే సెంటిమెంటు సినిమా అయ్యుంటుంద‌ని జ‌నాలు ఏమంత ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌లేదు. కానీ తాజాగా రిలీజైన ఈ చిత్ర టీజ‌ర్ చూశాక మాత్రం జ‌నాల అభిప్రాయ‌మే మారిపోయింది. చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఈ టీజ‌ర్ సూప‌ర్బ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. అంత ప్ర‌త్యేక‌త ఈ టీజ‌ర్లో ఏముందో చూద్దాం ప‌దండి.

ఒక కారు ముందుకు క‌దులుతుండ‌గా అందులోంచి ఆడ‌గొంతులు వినిపిస్తాయి. ఒకావిడ నీ ట్యాబ్ లో క్యాల్కులేట‌ర్ ఉందా అని అడుగుతుంది. అది అందుకుని మా ఇంట్లో ఏడుగురు ఉంటారు. ఒక్కొక్క‌రు ఆరు దోసెలు తింటార‌నుకుంటే.. నెల‌లో 20 రోజులు వేసుకున్నా గ‌త 30 ఏళ్ల‌లో నేను 3 ల‌క్ష‌ల‌కు పైగా దోసెలు వేసి ఉంటాన‌ని అంటుంది. ఇంకొకావిడ నేను మా ఆయ‌న‌కు మాత్ర‌మే 5 ల‌క్ష‌లు దోసెలు వేసిచ్చి ఉంటా అంటుంది. ఇంకొకావిడ త‌న లెక్క రెండున్న‌ర ల‌క్ష‌ల‌ని తేలుస్తుంది. మ‌నం ఇన్నేసి దోసెలు వేసిచ్చాం మ‌న‌కు ఎవ‌రైనా ఎప్పుడైనా ఒక్క దోసె వేసిచ్చారా అన్న డిస్క‌ష‌న్ వ‌స్తుంది. ఈ డైలాగ్స్ ఇలా న‌డుస్తుండ‌గానే కారు అద్భుత‌మైన హిల్ స్టేష‌న్ అందాల మ‌ధ్య దూసుకెళ్తూ ఉంటుంది. చివ‌ర్లో జ్యోతిక కారు దిగి.. నేనూ ఈ లోకంలోనే ఉన్నా అని అరుస్తుంది. ఆమెతో ఉన్న ముగ్గురూ కూడా వ‌చ్చి జాయిన్ అవుతారు. ఇదీ ‘మ‌గ‌రిల్ మ‌ట్టుం’ టీజ‌ర్ ముచ్చ‌ట. టీజ‌ర్ సింప్లీ సూప‌ర్బ్ అనిపించేసిందంతే. విజువ‌ల్స్.. మ్యూజిక్ ఈ టీజ‌ర్ కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ‘కుట్రం క‌డితాల్’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న బ్ర‌మ్మ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. జ్యోతిక భ‌ర్త సూర్య‌నే నిర్మాత‌.

Full View
Tags:    

Similar News